ప్రతి ఒక్కరిలో సత్యం అనేది కాంతిని వెదజల్లే జ్వాల రూపంలో ఉంటుంది. ఆజ్వాల లేకుండా ఎవరు జీవించలేరు. ఎందుకంటే ఆ జ్వాలయే భగవంతుడు. ఆయనే సమస్త సత్యానికీ మూలము. ఈ నిజ తత్వాన్ని తెలుసుకోవాలన్నా మనిషి నిరంతరం సత్యాన్వేషణలో ఉంటాడు.
సత్యం అనేది మార్పు చెందనిది. దేశ, కాల పరిస్థితులు సత్యాన్ని మార్చలేవు. అసత్యం తో కూడిన లౌకిక విషయాలు సత్యాన్ని మార్చలేవు.
“సత్యం అప్రియంగా ఉన్నప్పటికీ, అసత్యం ప్రియంగా ఉన్నప్పటికీ ఆ రెండింటినీ వదిలివేయాలి”. “సత్యానికి కట్టుబడి ఉండటం వలన మనిషి ఉన్నతుడై, మంచివాడిగా మారగలడు అన్న విషయాన్ని “సత్యమే దైవము” అనే కథ విద్యార్థుల హృదయాలను ఆకట్టుకునే విధంగా బోధించవచ్చు.