నెమ్మదిగా పయనించండి సురక్షితంగా చేరుకోండి
లక్ష్యం:
పెన్సిల్ మరియు కాయిన్ గేమ్ అనేది గురుత్వాకర్షణ, సమతుల్యత, సమరూపత మరియు చక్కటి రూపకల్పన గురించి పుష్కలంగా నేర్చుకునే అనుభవాలను అందించే వినోదంతో కూడిన కార్యకలాపం.
సంబంధిత విలువలు:
- ఏకాగ్రత
- సహనం
- దృఢత్వం
- సంకల్పం
- పట్టుదల
- సమస్య పరిష్కారం
- ఆత్మ తృప్తి
- సాఫల్యం
కావలసిన పరికరములు:
- ఓకే పరిమాణంలోనున్న ఒక రూపాయి నాణేలు – 10.
- పెన్సిల్ – ఒక చివర చెక్కినదిగా మరొకవైపు చదునుగా ఉండవలెను
- పెద్ద బంగాళాదుంప సగం ముక్క
- చిన్న పళ్ళెము
- గడియారము
గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:
ఏదీ లేదు
ఆట ఆడు విధానము:
- గురువు పిల్లలకు ఆట గురించి వివరిస్తాడు.
- ప్రతియొక్క ఒక్క పిల్లలకు సగం కట్ చేసిన బంగాళాదుంపను చిన్న పల్లెలో ఉంచవలెను.
- పిల్లలు చెక్కిన పెన్సిల్ భాగమును బంగాళాదుంపలోకి చొప్పించవలెను (ఇది స్టాండ్‌గా పనిచేస్తుంది).
- పది నాణేములను పెన్సిల్ యొక్క మరొక చివరలో ఒక్కొక్కటిగా ఉంచవలెను.
- అలా చేస్తున్నప్పుడు, కొన్ని నాణేలు పడిపోయినా, పిల్లలు తమ ప్రయత్నాన్ని కొనసాగించడానికి అనుమతించవలెను.
- గురువు అందరిచేత ఒకే సమయంలో ఆట ప్రారంభింపజేయవలెను.
- నిర్ణీత సమయంలో మొత్తం పది నాణేలను ఉంచిన వ్యక్తి విజేతలుగా నీలిచెదరు.
గురువులకు చిట్కాలు:
- కుందేలు & తాబేలు కథ.
- రాబర్ట్ బ్రూస్ మరియు స్పైడర్ & ఇతరులు సంబంధం కధలు ఉపయోగకరముగా నుండును.
సంబంధిత సూక్తులు:
- నిదానమే ప్రధానము
- నెమ్మదిగా, జాగర్తగా పయనించిన విజయం నీ సొంతమవుతుంది
- తొందరపాటు అనర్దానికి దారితీస్తుంది