శ్రీ సత్య సాయి అష్టోత్రం
లక్ష్యం:
ఈ ఆట పిల్లలకు సరైన క్రమంలో మరియు ఆనందించే విధంగా సాయి అష్టోత్రాన్ని గుర్తుంచుకోవడానికి మరియు గుర్తుచేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.
సంబంధిత విలువలు:
- భక్తి
- జ్ఞాపకశక్తి
- అప్రమత్తత
- కలసిమెలిసి ఉండుట
కావలసిన పరికరములు:
ఒక బంతి
గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:
ఏదీ లేదు
ఆట ఆడు విధానము
- గురువు పిల్లలను గుండ్రంగా వరుస క్రమంలో నిలబెట్టావలెను. అందులో ఒకరికి బంతిని ఇవ్వవలెను.
- బంతితో ఉన్న పిల్లలు సాయి అష్టోత్రం నుండి మొదటి నామాన్ని జపించాలి మరియు ఇంకొక పిల్లల పేరును పిలుస్తూ బంతిని మరొక పిల్లలకు విసిరి వేయాలి.
ఉదాహరణ: ఓం శ్రీ భగవాన్ సత్య సాయి బాబాయ నమః - రెండవ బాల / బాలిక బంతిని పట్టుకుని వరుస క్రమములో తదుపరి నామము జపిస్తూ మరియు ఇంకొక పిల్లల పేరును పిలుస్తూ బంతిని మరొక పిల్లలకు విసిరి వేయాలి.
ఉదాహరణ: ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః అని జపిస్తుంది. - మరొక బాల / బాలిక ఆ బంతిని పట్టుకొని మూడవ నామాన్ని జపించి మరొక బాలబాలిక పేరు చెప్పి బంతిని విసరవలెను.
- నిర్దిష్ట సమయములో, బాల / బాలికలు బంతిని విసురుతూ నామాలను సరైన క్రమంలో జపించే వరకు ఆట ఈ పద్ధతిలో కొనసాగుతుంది.
- తన తన దగ్గరకు బంతి వచ్చిన సమయంలో వరుసక్రమములోనున్న నామాన్ని గుర్తుకు తెచ్చుకోలేనప్పుడు పిల్లలు ఆట నుండి వెన్నతొలుగదరు.
గురువులకు చిట్కాలు:
- గురువులు ఈ ఆట ద్వారా పిల్లల అప్రమత్తత, జ్ఞాపక శక్తి, మేధస్సును, పరీక్ష చేయవచ్చును
- ఆటను మరింత ప్రభావవంతంగా మరియు ఆసక్తికరంగా చేయడానికి, పిల్లలను ఆట ప్రారంభించే ముందు అష్టోత్రం సెట్ వారీగా (సెట్టుకు 10 నామములు చప్పున) నేర్చుకోమని అడగవచ్చు. ఇది పిల్లలను పరీక్ష చేయడానికి ఉపయుక్తమైన చక్కటి సాధనంగా పనిచేస్తుంది.