గోవిందుని అన్వేషించు – దేవుడిని వెతుకు
భజ గోవిందం అనే దానిలోని రెండు పదాలు ‘భజ’ ‘గోవిందం’ అనే పల్లవితో శ్రీ శంకర భగవత్పాదులు మొత్తం వేదాంత తత్వాన్ని బోధించారు. మానవజాతి మోక్షం కోసం మతం. గోవిందుని నివాస స్థానమైన పరమానంద రాజ్యం లోకి ప్రవేశించడానికి మరియు ప్రస్తుత మన జీవిత దుస్థితి అంతం చేయడానికి ఈ సరియైన సమాధానాన్ని ఈ గీతం అందిస్తుంది.
ముప్పై ఒక్క మధురమైన గీతాలతో కూడిన శ్లోకాలను మనం సులువుగా అర్థం చేసుకోడానికి కావాల్సిన ఉదాహరణలతో, దృష్టాంతాలతో మనలోని పొరపాట్లు, వదలాల్సిన అనవసరమైన విషయాల గురించి శ్రీ శంకరులు చెబుతారు. వరుసగా ఒక్కొక్క శ్లోకాన్ని చెబుతూ మనలోని మాయ తెర తొలిగిస్తాడు. మనలోని అజ్ఞానం, భ్రాంతి, మోహాన్ని తొలగిస్తాడు, మన కష్టాలు అన్నిటికీ పరిష్కారం చూపిస్తాడు. అందుకే దీన్ని మోహముద్గర అని పిలుస్తారు. వారు మన జీవితంలోని అన్ని కోణాలను స్పర్శిస్తాడు. అవి మనల్ని ఎలా అంధులుగా బంధిస్తాయో మరియు అజ్ఞానం, దుఃఖం అనే అంధకారపు అగాధం లోని లోతుల్లోకి నెట్టివేస్తాయి. మనలోని ప్రతి ఒక్కరూ అసత్యం నుంచి సత్యానికి క్షణికావేశం నుంచి శాశ్వతానికి వాచక ఆకర్షణ మరియు పరధ్యానం కోసం వైరాగ్యం పెంచుకుని గోవిందుని సాక్షాత్కరింప చేసుకోవాలి అని కోరుతాడు. విచక్షణ వివేకం అనే జ్ఞాన దృష్టి తో వివేకం పెంపొందించుకోవాలని శంకరులు కోరుకుంటారు. సత్యానికి కట్టుబడి తద్వారా ఈ అసాధారణమైన అస్తిత్వం యొక్క బాధ మరియు బానిసత్వం నుండి విముక్తి పొందడం.
జగద్గురు ఆదిశంకరాచార్య నిస్సందేహంగా భారతదేశం లేదా ప్రపంచం సృష్టించిన గొప్ప శాస్త్రవేత్త. తాత్వికుడు భక్తుడు ఆధ్యాత్మిక వేత్త. కవి, మత సంస్కర్త ఇటువంటి లక్షణాలను తనలో నిక్షిప్తం చేసుకున్న అద్వితీయుడు. వారు 12 వందల సంవత్సరాల క్రితం జీవించినప్పటికీ ఈ మేధావి ప్రభావాన్ని భారత దేశం, ప్రపంచం ఈనాటికీ అనుభవిస్తున్నాయి.
ధర్మం మరియు ధర్మంపై ఆధారపడిన ప్రతిదీ క్షీణించినప్పుడు భగవంతుడు భూమి మీదకు వస్తాడని భగవద్గీతలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేశంలో నైతిక మత పరమైన గందరగోళం ఏర్పడిన సమయంలో శంకరులు భారతీయ సంస్కృతిలో కనిపించారు.
శంకరాచార్య 8వ శతాబ్దంలో జన్మించారు. ఆ సమయంలో బౌద్ధ మతం దేశంలో విస్తృతంగా వ్యాపించింది అయినా గురువు యొక్క స్వచ్చమైన సరళమైన బొధనల రూపంలో పరిస్థితి మారింది. జైన మతం కూడా ఎంతో ప్రభావం వల్ల అనేక మంది అనుచరులను సంతరించుకుంది. సామాన్యుల అవగాహన ప్రకారం రెండు మతాల వల్ల దేవుని ఉనికి క్షీణించి నాస్తికత్వం ప్రజల జీవనంగా నాస్తిక వాదం మతంగా మారింది. హిందూ మతం అనేక సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా మరియు అసహనంగా మారి వర్గాలుగా తెగలుగా చీలిపోయింది. భూమి మీద మత సామరస్యం కొరవడింది. అదేకాకుండా సాల్వులు, వామాచారులు శాక్తేయులు గాణాపత్యులు, సౌరములు భాగవతులు, యతిజ్ఞులు మొదలైన అసహ్యకరమైన విసర్జనలు మతం యొక్క స్వచ్ఛతను మరియు పరమాత్మను చెడగొట్టాయి. ధర్మం యొక్క మౌలిక సూత్రాలు దిగజారి పోకుండా అరికట్టేందుకు, సంఘంలో నైతిక, మత, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి అన్ని ఆలొచనలు ఏకీకరణ ఆ సమయానికి అవసరం. ఏకీకరణ సామరస్యం పునరుజ్జీవనం ఇలాంటివి భగవంతుడు మాత్రమె చేయగలడు. శంకరుడు అవతరించి దాన్ని చేపట్టి పూర్తి చేశారు.
32 సంవత్సరాల జీవిత కాల పరిధిలో శంకరుడు అద్వైత వేదాంత తత్వాన్ని హిందూ మతానికి అవసరమైన ఏకత్వాన్ని స్థిరంగా స్థాపించాడు. వారు దేశంలో మత సామరస్యాన్ని, ఆధ్యాత్మిక సమన్వయాన్ని మరియు నైతిక పునరుద్ధరణను సాధించారు.