బుద్ధ జయంతి వేడుకలు మరియు సంప్రదాయాలు
- బుద్ధ జయంతి యొక్క ప్రధాన వేడుకలు బౌద్ధ గయ లో జరుగుతాయి.
- బుద్ధ పౌర్ణమి కి బౌద్ధులు అంతా బుద్ధునికి నివాళులు సమర్పించుటకు ప్రపంచం నలుమూలల నుండి తరలి వస్తారు.
- ఆలయము, ఆలయం చుట్టూ ఆవరణ అంతా రంగురంగుల బౌద్ధ జెండాలతో శోభాయమానంగా అలంకరిస్తారు.
- ప్రాతః కాలమున బౌద్ధ గురువులు ప్రార్థనలు చేసి, తదుపరి వూరేగింపు నిర్వహిస్తారు. అనంతరంమిఠాయిలు, తినుబండారముల పంపిణీ జరుపుతారు.
- బుద్ధ జయంతి రోజు ప్రార్థనలు, ఉపన్యాసాలు,బుద్ధుని బోధనలు బౌద్ధ ఆరామాలలోను, మందిరములోనూ, బౌద్ధుల ఇళ్ళలోనూ మారుమ్రోగుతాయి.
- ఆరోజు బౌద్ధులు తెల్లని వస్త్రాలను ధరిస్తారు.
- ప్రజలు బుద్ధ విగ్రహానికి ధూపము, దీపము, పూలు, పండ్లు సమర్పిస్తారు. ఆ రోజంతా బుద్ధుని బోధనలు, ప్రసంగాలు వింటూ గడుపుతారు.
- బౌద్ధ గయ లోని మహాబోధి ఆలయం రంగు రంగుల జెండాలతో, పువ్వులతో అలంకరించబడి, పండుగ వాతావరణంతో శోభిల్లుతుంది. జ్ఞానోదయం పొందిన భోధి వృక్షం క్రింద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి
- కొత్త ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం లో బుద్ధ జయంతి సందర్భంగా ప్రజల సందర్శనార్థం బుద్ధుని మృతదేహాన్ని తీసుకుని వస్తారు.
- బుద్ధ పౌర్ణమి నాడు ప్రజల కొరకై త్రాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. జంతువుల పట్ల ఎంతో దయ చూపిస్తారు.
- బుద్ధ జయంతి చాలా ప్రశాంతంగా జరుపుకునే బౌద్ధుల పండగ.
- బౌద్ధ పురాణం ప్రకారం బుద్ధుని భార్య యశోధరను, అతని మొదటి శిష్యుడు,సోదరుడు అయిన ఆనందను, అతని రథసారథి చన్నాను, అతని గుర్రం కంటకను, రాజ్యాన్ని త్యజించాడు. వీరంతా మళ్ళీ పవిత్రమైన బుద్ధ జయంతి రోజు జన్మించారని కొన్ని కథనాలు కలవు