చిత్రకళ మరియు చేతితో రకరకాల వస్తువులు తయారు చేయడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు.
రంగులు వేయడం, మట్టి తో బొమ్మలు తయారు చేయడం, కాగితం మడత పెట్టి అందమైన ఆకృతి ని సృష్టించడం, గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం మొదలగు కార్యకలాపాలు వారిలోని కళాత్మకత, సృజనాత్మక శక్తి నీ అభివృద్ధి పరుస్తాయి.
ముఖ్యం గా చిన్నపిల్లల కు ప్రకృతి లో వున్న ప్రకాశవంతమైన మరియు అందమైన విషయాలు గురించి అవగాహన కల్పించి వాటి పట్ల ప్రేమను పెంపొందించాలి. దాని వలన వారిలో ఆత్మ శక్తి,సున్నితమైన భావాలు, అంతర్దృష్టి వికసిస్తాయి.
పోస్టర్ తయారీ వంటి కార్యకలాపాలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఒక బృందం గ ఏర్పడి స్నేహభావం, కలిసి మెలసి పనిచేయడం ప్రోత్సహిస్తాయి. బాలవికస్ తరగతులలో శ్లోకం, కథ,క్విజ్,ప్రదర్శనలు నిర్వహించడం, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు మొదలైన వాటి తో పాటు చిత్రకళ మరియు చేతిపనులు అదనం గ పిల్లలకు నేర్పాలి.
గురువులు కొత్త ఆలోచనలతో ఆసక్తికరంగా మరియు సమర్థవంతంగా పిల్లలను ఆకట్టుకునే విధంగా విలువలను,బోధనపదతులను ప్రవేశపెట్టాలి.
కొన్ని ఉదాహరణలు సంబందదితవిలువల తో క్రింద ఇవ్వబడినవి