అనన్యాశ్చింతయంతో మాం
ఆడియో
శ్లోకము
- అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
- తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ।।
తాత్పర్యము
ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారికి, అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. వారి బాధ్యత అంతా నాదే. (లేని వస్తువును పొందుటను ‘యోగము’ అంటారు. పొందిన వస్తువును రక్షించుకొనుటను ‘క్షేమము’ అని అంటారు).
వివరణ
అనన్యాః | ఎల్లప్పుడూ, ఇతర భావములు లేకుండా |
---|---|
చింతయంతః | స్మరిస్తూ |
మాం | నన్ను |
యే | ఎవరైతే |
జనాః | జనులు |
పర్యుపాసతే | (నన్నే) ధ్యానించుచున్నారో |
తేషాం | అటువంటి వారి యొక్క |
నిత్య -అభియుక్తానాం | నిత్యము (సదా) నా యందే నిమగ్నమై ఉన్నారో |
యోగ | ఆధ్యాత్మిక సంపత్తిని అందిస్తాను |
క్షేమమ్ | ఆధ్యాత్మిక సంపత్తిని రక్షిస్తాను |
వహామి | వహించెదను |
అహం | నేను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3