శ్రేయోహి
ఆడియో
శ్లోకము
- శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ।
- ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ।।
తాత్పర్యము
యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమయినది. ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మంచిది. ఎందుకంటే ఇటువంటి కర్మ ఫల త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును.
వివరణ
శ్రేయః; హి | మంచిది; నిజముగా శ్రేష్ఠము |
---|---|
జ్ఞానం | జ్ఞానము |
అభ్యాసాత్ | అభ్యాసము కంటే |
జ్ఞానాత్ | జ్ఞానము కంటే |
ధ్యానం | ధ్యానము |
విశిష్యతే | శ్రేష్ఠమయినది |
ధ్యానాత్ | ధ్యానము కంటే |
కర్మ-ఫల-త్యాగః | కర్మ ఫలముల త్యాగము |
త్యాగాత్ – శాంతి: – అనంతరమ్ | తక్షణమే శాంతి కలుగుతుంది త్యాగము; శాంతి; తక్షణమే |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty