యుక్తః కర్మఫలం
ఆడియో
శ్లోకము
- యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్।
- అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ।।
తాత్పర్యము
యోగ యుక్తుడు (నిష్కామ కర్మ యోగి) కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి చిత్తశుద్ధి వలన శాశ్వతమగు శాంతిని పొందుతున్నాడు. యోగ యుక్తుడు కాని వాడు (ఫలాపేక్షతో కర్మలను చేయువాడు) ఆశచే కర్మఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు (మమతా అనుబంధాలతో బంధింప పడుతున్నారు). (చిత్త వృత్తులను అణచుకొనుటను యోగమందురు.)
వివరణ
యుక్తః | యోగ్యుడైన వాడు (నిష్కామ కర్మయోగి) |
---|---|
కర్మ-ఫలం | చేసిన పనుల ఫలితములను, ఫలములను |
త్యక్త్వా | త్యజించి |
శాంతిం | శాంతిని |
ఆప్నోతి | పొందును |
నైష్ఠికీమ్ | నియమబద్ధమైన, శాశ్వతమైన |
అయుక్తః | కోరికలతో కూడిన కర్మలు చేసినవాడు |
కామకారేణ- కామ+కారేణ | కోరికల చే ప్రభావితుడై |
ఫలే | ఫలముల యందు |
సక్తః | ఆసక్తి/మమకారంతో |
నిబధ్యతే | బంధనలతో బంధింపబడును, చిక్కుకొనును |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
వివరణ