భారత దేశం సాంస్కృతిక అలవాట్లు, మర్యాదా విలువలు
ఒక జాతి యొక్క సాంస్కృతిక అలవాట్లు, మర్యాదలు మరియు ఆదర్శాలు జాతి చారిత్రక విలువల వాటి మూలాల్లో ఉంటాయి. ప్రజలు ఎంచుకున్న ప్రేమ తత్వాలు, వారు పెంపొందించుకున్న ఆదర్శాలు మరియు విలువలు వారి మూలాల్లో ఉంటాయి. ప్రజలు ఎంతో ప్రేమగా ఎంచుకున్న మరియు ఉన్నతంగా జీవించడానికి తోడ్పడిన ఆదర్శాలు విలువలు అలవాట్లు మర్యాదలు వారి వైఖరిలో కనబడుతాయి. అవి ఒక దేశం యొక్క సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలు. చారిత్రక సంఘటనలు ప్రజలు జీవితాలపై ప్రభావం చూపుతాయి. అటువంటివి మన దేశంలో కూడా ఉన్నాయి. మన భారత దేశం రాజకీయ మరియు ఆర్ధిక తిరుగుబాట్లలో తన వాటా కలిగి ఉంది. ఏమైనా మన సంస్కృతి యొక్క జీవశక్తి దాని మూలాలు ఎప్పటికీ బలంగానే ఉన్నాయి. ఇది చారిత్రక ఘటనల వల్ల వెల్లడైంది. భారతీయ స్ఫూర్తి చెక్కుచెదరకుండా ఉన్నది. ఐదువేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ప్రేరేపించిన జ్ఞాన దృష్టి ఇప్పటికీ మనలో ఉంది.ఇదే మన ఉనికికి అర్థం మరియు ప్రేరణ కలిగిస్తుంది. ఈ విశాలమైన ఉపఖండంలో ప్రాంతాల వారీగా జీవన విధానాలు మారవచ్చు అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల సంస్కృతి యొక్క ప్రాధమిక ఆధ్యాత్మికత విశాల భావాలు లేదా అశాశ్వతమైన విశ్వం యొక్క దర్శనం భౌతికమైనది భారతీయ సంస్కృతి హృదయం నుండి పుట్టిందని భగవంతునిపై నమ్మకం ఆయన సృష్టి మీద ప్రేమ భారతీయ సంస్కృతికి ప్రాధమికమని బాబా చెప్పారు. భారతీయ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విలువలు అన్ని భౌతిక విషయాలపై ఆధిపత్యం కలిగి ఉంటాయి. భగవంతునితో సరియైన సంబంధం కలిగే వరకు భౌతికం దాని పూర్తి అర్థాన్ని పొందదు అని భారతీయుల ఆలోచనా పూర్వకమైన నమ్మకం. అందుకే ప్రతిదీ సత్య దృక్పథంతో మార్గ నిర్దేశం చేయాలి. అందరితో ఆత్మీయ సంబంధం, అన్ని జీవుల ఏకత్వం, భగవంతుడి అస్తిత్వం సర్వత్రా వ్యాపించి ఉన్నదనే శాశ్వత ప్రాధమిక సత్యాలు భారతీయ సంస్కృతిని యుగయుగాలుగా నడిపిస్తూ, పాలిస్తూ, పోషిస్తూ పరిరక్షిస్తున్నాయి. ఒకరు బాబాను ఇలా అడిగారు ‘మన పాదం పొరపాటున వారెవరికైనా తగిలితే వెంటనే తగిలిన వారి భాగాన్ని ముట్టుకుని వొంగి నమస్కారం చేస్తారు ఎందుకని’ అప్పుడు బాబా చెప్పారు ‘అందరిలోనూ అంతటా వ్యాపించి భగవంతుడే ఉన్నాడని ప్రతిదీ పవిత్రమైనదని భారతీయుల విశ్వాసం’ అని వివరించి చెప్పారు.
సాధారణంగా సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు ఆ పదానికి సమగ్రమైన ఖచ్చితమైన నిర్వచనం చెప్పడం సాధ్యం కాదు. డాక్టర్ వి కే గోకాక్ మనకు సరియైన నిర్వచనం అందించారు. ఇది జీవితంలో అన్ని రంగాల్లో పరిపూర్ణతను సాధించాలనే ఉద్దేశం కావచ్చు. ఒకరి స్వంత అలవాట్లు వైఖరులు మరియు మర్యాదలతో పాటు సమాజానికి కూడా కప్పి ఉంచి రక్షణ కలిగిస్తుంది అని గోకాక్ చెప్పారు. వారు మరింత జోడిస్తూ జ్ఞానం నమ్మకం ఆచారాలు నైతిక ఆధ్యాత్మిక విలువలతో కూడిన సంక్లిష్టమైన తత్వం.ఈ సందర్భంలో సంస్కృతిలో భారతీయుల భావన ప్రజల జీవితాల్లోని అన్ని అంశాలను స్వీకరించేంత విస్తృతమైంది.
భారతీయ సంస్కృతి కాల పరీక్షకు నిలిచే స్వదేశ్వీయ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ తన మార్గంలోకి వచ్చిన విదేశీ సంస్కృతిని సైతం ఉదాసీనంగా ఉంది. ఇస్లామిక్ పోర్చుగీసు ఫ్రెంచ్ మరియు అత్యంత ప్రముఖమైన బ్రిటిష్ ప్రభావాలను గ్రహించారు. భారతీయులు తమ సంస్కృతి మతానికి భిన్నంగా ఉన్న భిన్న సంస్కృతులు మతాలకు ఎప్పుడూ తలుపులు మూయలేదు. భారతదేశం ఏ మత అభివృద్ధిని వ్యతిరేకించ లేదు. ఇక్కడకు వచ్చి తమ మత విశ్వాసాలను ప్రచారం చేసిన వారికీ ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా హింసించబడిన యూదులను జొరాస్ట్రియనులను భారతీయులు స్వాగతించారు. భారతీయ సంస్కృతి ప్రధానంగా భారతీయమైంది అయినా అది విభిన్న లక్షణాలు కలిగిన సంశ్లేషణ అని చెప్పవచ్చు.
భారతీయ లలిత కళలు, భాషలు, వేడుకలు, ఆచారాలలో భిన్న సంస్కృతుల కలయిక కనిపిస్తుంది. భారతీయుల ఆహారపు అలవాట్లు, వేషధారణ ఒక్కొక్క ప్రాంతంలో వేరుగా ఎందుకు ఉంటాయో దేశ భౌతిక లక్షణాలు తెలుపుతాయి. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఏడవది. 37,87,782 మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. సముద్ర తీర ప్రాంతం అరవై వందల కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ప్రధాన భూభాగం నాలుగు దిక్కులా వ్యాపించి ఉంది. ఉత్తర ఈశాన్య ప్రాంతం గొప్ప పర్వత శ్రేణుల ప్రాంతం. గంగా, సింధు తీరాలు మైదానం ఎడారి ప్రాంతాలు దక్షిణ ద్వీప కల్పం, ముఖ్యమైన హిమాలయ నదులు, లోతట్టు నదులు విలక్షణమైన వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది భారత దేశంలో అనేక రకాల వృక్ష జాతులు జంతు జాతులు ఉన్నాయి.1978 మార్చి నాటికి భారత దేశం జనాభా 63.68 కోట్లు. 83 శాతం మంది హిందు మతం అనుసరిస్తున్నారు. మిగిలిన జనాభా ఇస్లాం సిక్కు బౌద్ధ జైన, జొరాస్ట్రియన్ క్రిస్టియన్ మతాలను అనుసరిస్తున్నారు. కొద్ది మంది మాత్రమే యూదులు. భారత దేశంలో కొద్ది మంది మాత్రమే నగరాల్లో నివాసం,. జనాభాలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
భారత దేశంలో సంస్కృతి అలవాట్లు మర్యాదలు గురించి మాట్లాడేటప్పుడు దాని నైసర్గిక స్వరూపం, జనాభా నివాసం గురించి దృష్టిలో ఉంచుకోవాలి.