వసుదైవ కుటుంబం
ప్రపంచమంతా దేవుని కుటుంబం మాత్రమే, అని మన గ్రంథాలు మనకు బోధిస్తున్నాయి: ప్రపంచంలోని అన్ని ఇతర మతాల గ్రంథాలు కూడా మనకు “దైవ పితృత్వం – మానవ సోదరత్వం” యొక్క సత్యాన్ని బోధిస్తున్నాయి. హీబ్రూ భాషలో ఆడమ్ అంటే “మనిషి” లేదా “అడ్మి” అని అర్ధం. అంటే మానవాళి అందరికీ సాధారణ పూర్వీకుడు అని కూడా బైబిల్ చెబుతుంది. హిందూ భావనలో, మొట్టమొదటి మనిషి మనువు అని నమ్ముతారు. మానవాళి అంతా అతని వారసులు మాత్రమే అని చెప్పబడింది. కుల, వర్గ భేదం, రక్తం లేదా సంతతి యొక్క భేదాలు మానవ సమానత్వం యొక్క ప్రాథమిక వాస్తవాన్ని భర్తీ చేయవు. “మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు?” అని యూదు రబ్బీలను అడిగిచూడండి మరియు సమాధానం ప్రయత్నించండి. “నా తండ్రి నీకంటే గొప్పవాడు” అని ఎవరూ మరొకరితో అనకూడదని, అలాగే “నీ పొరుగువాన్ని నిన్నుగా ప్రేమించుకొనుము” అని బైబిలు బోధిస్తోంది.
“ఆధునికులు” మన ప్రవక్తల గ్రంధ బోధలను ఉద్దేశ్యపూర్వకంగా ప్రక్కకు నెట్టడానికి కారణం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం యొక్క అసాధారణ పురోగతి అనేది వాస్తవం. ఇదే మన ఈ ఏకీకృత ప్రపంచ సమాజానికి భౌతిక ఆధారం. దీని ద్వారా దేశాల మధ్య దూరం యొక్క అడ్డంకులు తగ్గిపోయాయి, విమానాలు భూమిని చుట్టుముట్టాయి. కృత్రిమ ఉపగ్రహాలు భూగోళం చుట్టూ తిరగడం వలన మనం ఖండాలు మరియు మహాసముద్రాలలో ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా మాట్లాడగలము. ఈ పరిస్థితులలో, అన్ని దేశాలు సోదర- దేశాలుగా కలిసి జీవించడానికి ప్రయత్నించడం మరియు ప్రజలందరూ ఒకే సోదరభావంగా జీవించడానికి ప్రయత్నించడం అత్యవసరం. ఇది అనివార్యమైన మరియు ఆచరణాత్మక అవసరం. కానీ, భౌగోళిక సామీప్యత, మానసిక ఐక్యత, పరస్పర అవగాహన, ప్రేమ మరియు గౌరవంతో కట్టుబడి ఉన్న హృదయాలు మాత్రమే ఐక్యతగా పెరుగుతాయి తప్ప, ఇతరముల ఐక్యత నిలకడగా మరియు శాశ్వతంగా ఉండదు. మన గ్రంధాలలో సత్యమైన సమస్త జీవరాశి మరియు అస్తిత్వం, సమస్త సృష్టితో ప్రతి ఒక్కరి ఏకత్వం, ఆత్మ యొక్క అవగాహన మొదలైన ఆధ్యాత్మిక సత్యాలు పొందుపరిచి బడ్డాయి. మానసిక ఐక్యతకు లోతైన మర్గాలు, స్థిరమైన పునాది అవసరం. భగవద్గీత అర్ధం చేసుకుంటే, అందరి హృదయాలలో నమ్మకం దృఢపరచబడుతుంది. హృదయాన్ని సంస్కారవంతం చేయాలి మరియు విశాలంగా చేయాలి. ఏకత్వాన్ని గ్రహించడానికి మనస్సును విద్యావంతం చేయాలి. సమస్త సృష్టిలో సజాతీయత, సామరస్యం మరియు ఏకత్వాన్ని చూడడానికి దృష్టిని విస్తృత పరచాలి. అందరిలో దైవత్వ స్పృహ మేల్కొలపడం వల్ల కలిగే ఈ ఉత్కృష్టమైన అవగాహన మరియు అనుభూతి, వారి ఆలోచన, మాట మరియు పని మరియు జీవితంలోని అన్ని కార్యకలాపాలలో వ్యక్తమయ్యేలా చేయాలి. మానవులమైన మనం మాత్రమే అన్ని గ్రంథాల ఉద్దేశ్యాన్ని నెరవేర్చగలము. అప్పుడే ప్రపంచంలో శాంతి మరియు సంతోషాలు రాజ్యమేలుతాయి మరియు మానవాళి నిజమైన సోదరభావంతో ఒకే కుటుంబములా, నిజంగా వాసుదేవుని కుటుంబంలా జీవించగలదు.
ప్రపంచ పౌరసత్వానికి ఇల్లే ప్రారంభ స్థానం
ఒక నిజమైన ప్రపంచ పౌరుడిగా జీవించడమే మన లక్ష్యం అని చెప్పవచ్చు. దీని కోసం, ఒక వ్యక్తి తనను తాను అభివృద్ధి చేసుకోవాలి మరియు అభివృద్ధి చెందాలి. దీనికి ప్రారంభ స్థానం వారి ఇల్లు మాత్రమే. మొదటిది ఒక వ్యక్తిగా ప్రారంభమవుతుంది: అప్పుడు అతను ఇంటిలో తనను తాను సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి, కుటుంబంలో ఉపయోగకరమైన సభ్యుడిగా తన బాధ్యత నిర్వహించాలి; అప్పుడు అతను ఎదిగి సమాజానికి, దేశానికి, తరువాత ప్రపంచానికి ఉపయోగకరమైన సభ్యుడిగా మారాలి… ఇది నిజంగా పరిణామ ప్రక్రియ. హృదయపు పుష్పాన్ని విప్పి, మేధో ప్రకాశం మరియు వివేకం చేత సాధ్యమవుతుంది. ఈ విధంగా, ఈ పురోగతి ప్రక్రియలో సహజంగానే ఇల్లు ప్రతి ఒక్కరికి ప్రారంభ స్థానం.
నిజమే. అన్ని సామాజిక వ్యవస్థలలో కుటుంబం పురాతనమైనది అని చెప్పబడింది. ఒక కవి ఇలా పాడాడు.
“ఇల్లు! బొమ్మరిల్లు! ఇల్లు లాంటి ప్రదేశం లేదు…”
“సమాజం, స్నేహం మరియు ప్రేమ అనేవి మనిషికి దైవంచే ప్రసాదించబడ్డాయి…”
మానవులమైన మనం మన కుటుంబంతో చాలా అనుబంధంగా ఉన్నప్పటికీ, పక్షులు మరియు మృగాల విషయంలో, వాటి బాల్యం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. అవి స్వయంగా నిర్వహించగలిగిన క్షణంలో అవి వాటి తల్లిదండ్రులతో వాటి సంబంధాలను తెంచుకుంటాయి. కానీ, మన విషయానికొస్తే, మానవులలో, మన పసితనం మరియు బాల్యం ఎక్కువ కాలం ఉంటుంది. మనం యుక్తవయస్సు వచ్చే వరకు మరియు ఆ తర్వాత కూడా మన ప్రియమైన తల్లిదండ్రుల సహాయం కావాలి. పిల్లలను పెంచడానికి తల్లిదండ్రుల నుండి గొప్ప సహనం, సున్నితత్వం మరియు గొప్ప త్యాగం అవసరం. అందుకే మనం గుర్తుంచుకోవాలి. కుటుంబంలోనే మన వ్యక్తిత్వం నిర్మించబడింది. ఈ కుటుంబంలో మనము ప్రత్యేకంగా బలమైన మరియు శాశ్వతమైన మన సంస్కారం గ్రహించాము. కుటుంబంలోనే మనం జీవితం యొక్క విలువలను మరియు విధేయత, క్రమశిక్షణ, నిజాయితీ తెలుసుకున్నాము. “ఇవ్వడం -తీసుకోవడం” వంటి అన్ని ప్రధానమైన ధర్మాలను మరియు అన్నింటికంటే ముఖ్యంగా త్యాగం యొక్క స్ఫూర్తిని నేర్చుకుంటాము, కాబట్టి, ఇల్లు లేదా కుటుంబం పౌర ధర్మాల నర్సరీ అని మరియు వయోజన వ్యక్తిత్వానికి బాల్యంలో మూలాలు ఉన్నాయని చెబుతారు. అందుకే దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా కుటుంబం అభివృద్ధి చెందాలి.
శ్రీ సత్యసాయి బాబా ఒకప్పుడు ఇలా అన్నారు.
“హృదయంలో నీతి ఉంటే, వ్యక్తిత్వంలో అందం ఉంటుంది;
వ్యక్తిత్వంలో అందం ఉంటే…ఇంట్లో సామరస్యం ఉంటుంది:
ఇంట్లో సామరస్యం ఉంటే..దేశంలో క్రమబద్ధత ఉంటుంది:
దేశంలో క్రమబద్ధత ఉంటే.. మాటలో శాంతి ఉంటుంది”
పిల్లలలో కొంత ప్రయత్నం మరియు క్రమశిక్షణతో, మరియు అంతకంటే ఎక్కువగా, తల్లిదండ్రులు మరియు పెద్దల మార్గదర్శన ద్వారా పిల్లలు ఖచ్చితంగా జీవిత విలువలను తనులో తాము పెంచుకుంటారు. అది వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతుంది.