విభిన్న విశ్వాసాలను ప్రోత్సహించాలి, అన్ని మతాలు వర్ధిల్లాలి, భగవంతుని మహిమను అన్ని భాషలలో వివిధ రాగాలతో పాడాలి. విశ్వాసాల మధ్య విభేదాలను గౌరవించండి మరియు అవి ఐక్యతా జ్వాలను ఆర్పనంత వరకు వాటిని గుర్తించండి. నేను ఏ విశ్వాసానికి భంగం కలిగించడానికి కాదు, కానీ ప్రతి ఒక్కరికి తన స్వంత విశ్వాసాన్ని బలపర్చడానికి వచ్చాను– తద్వారా క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు, ముస్లిం, మంచి ముస్లిం మరియు హిందువు, మంచి హిందువు అవుతాడు.– బాబా
అన్ని విశ్వాసాల ఐక్యత గురించి స్వామి మానవాళికి నిరంతరం ఉపదేశించేరు. మానవులలో సోదరభావాన్ని మరియు భగవంతుని పై భక్తిని పెంపొందించే ఈ సర్వధర్మ భజనలను ఆలపిద్దాం.