భగవద్గీత నుండి ఎంపిక చేయబడ్డ శ్లోకముల పరిచయము
బాలవికాస్ మూడవ వర్గం సిలబస్లో భగవద్గీతలో 13 శ్లోకాలు ఎంపిక చేయబడ్డాయి. అది నిర్దిష్ట క్రమంలో, అర్థవంతంగా వర్గీకరించబడ్డాయి.
అవి జ్ఞానము, కర్మము, ఉత్తమము.
జ్ఞానము, విశ్వాసము | 1,2 శ్లోకములు |
---|---|
కర్మ | 3,4,5 శ్లోకములు |
గొప్ప ఆభయం | 6 వ శ్లోకము |
సాధన | 7,8,9,10,11,12,13 |
1,2 శ్లోకాలు జ్ఞానము మరియు విశ్వాసాన్ని గురించి తెలియజేస్తాయి.
జ్ఞానం అనగా ఏమి? జ్ఞానం అనగా తెలివి. జీవితమును సరిగ్గా అర్థం చేసుకోవటం. అనగా విభిన్న సమస్యలు, విభిన్న అంశాలు, దాని లక్ష్యము, ప్రయోజనాలను అర్థం చేసుకొనడం. కనుక పిల్లలకు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి. జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటే మాత్రం సరిపోదు. స్థిరమైన విశ్వాసంతో జ్ఞానాన్ని పొందటం నేర్చుకోవాలి. దానికి పిల్లలు ముందుగా చేయవలసినది స్వాధ్యాయము.
3 నుండి 5 శ్లోకాలు కర్మ గురించి తెలియజేస్తాయి.
స్వాధ్యాయం ద్వారా సేవా మార్గాన్ని చేరుకోవాలి. జ్ఞానం మరియు ఆధ్యాత్మిక సాధన యొక్క అత్యున్నత ఆవశ్యకతను అర్థం చేసుకున్నప్పుడు,ఆ వ్యక్తి దానిని పొందుటకై తగిన కృషి చేయాలి. స్వాధ్యాయం ద్వారా స్థిర చిత్తాన్ని అలవర్చుకున్న వ్యక్తి జీవితంలో తాను చేసే కర్మలపై శ్రద్ధ వహించాలి. ప్రతి కర్మను ఎటువంటి ఉద్దేశ్యము లేకుండా, పలాపేక్ష రహితంగా నిర్వర్తించాలి. ప్రతి కర్మను భగవదర్పణం గావించాలి. దీనినే నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ సాధనలో పురోగతిని కలిగిస్తుంది. జ్ఞాన సముపార్జనయే మన జీవన పరమావధి. చేసిన ప్రతి కర్మను సార్థకత చేసుకోవడం, స్వార్థరహితంగా చేసుకోవడం వలన ఆ కర్మ యోగం అవుతుంది. ఆ కర్మ చేసిన వాడు యోగి అవుతాడు.
6 వ శ్లోకము భగవంతుడు ఇచ్చిన గొప్ప అభయము గురించి తెలుపును.
ఆరవ శ్లోకము భగవంతుడు ఇచ్చిన గొప్ప అభయము శ్లోకము. అపారమైన విశ్వాసం కల భక్తులకు గొప్ప ఆభయము. తనను శరణు వచ్చిన భక్తుల పూర్తి బాధ్యతను భగవంతుడు స్వీకరిస్తాడు.
7 నుండి 13 శ్లోకాల వరకు సాధన గురించి తెలుపును:
స్వాధ్యాయం సాధనకు దారి తీస్తుంది. సాధన అంటే ఏమి? ఇంద్రియ నియంత్రణ. ఆలోచన, మాట, కర్మల పవిత్రతను చేకూర్చు అభ్యాసము. ధర్మబద్ధమైన జీవన విధానం కూడా ఇందులో సాధనగా చేర్చబడి ఉంది. జ్ఞానాన్ని పొందాలంటే జ్ఞానంతో పాటు సాధన అవసరం. మనిషి తనని తాను ఉద్ధరించుకోవటం అంటే తనని తాను ఎరుక కలిగి ఉంటూ, చిత్తశుద్ధితో చేయు ప్రయత్నమే.