మహావీర్ జయంతి
మహావీర్ జయంతి
జైన మతస్తులు వారి పండుగలు అన్నింటిలో మహావీర్ జయంతిని అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు.ఇది 24వ తీర్థంకరుడైన వర్ధమాన్ మహావీర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పర్వదినము. ఆరోజు జైనులు పుణ్యక్షేత్రాలను దర్శించడం, జైన తీర్థంకరులు పూజించటం, ప్రార్థించటం చేస్తారు. ఈ పర్వదినాన్ని ప్రార్థనలకు వినియోగించే సమయంగా వారు భావిస్తారు.
సందేశము:
- అహింస
- సత్యము
- అస్తేయము
- అపరిగ్రహము
- బ్రహ్మచర్యము