పైన పేర్కొనబడిన రెండు విలువల గురించిన కథలను ప్రత్యేకమైన జాబితా తయారు చేసుకోవాలి. మనిషి జీవితంలో ప్రధానమైన గుణము సత్యము. సత్యము నుండియే ధర్మము వెలువడుతుంది.
ధర్మము నుండి శాంతి తద్వారా ప్రేమ వెలువడుతాయి. ఈ విధంగా ప్రతి విలువ సత్యం నుండే వెలువడి, అందులోనే ఉంటూ తిరిగి అందులోనే లయమవుతుంది. సత్యము లేని ప్రదేశమే వుండదు. సత్యాన్ని కార్యాచరణలో పెడుతే అది ధర్మంగా రూపొందుతుంది. ఈ విభాగంలో పేర్కొనబడిన “సత్యమే దైవము” ద్వారా శ్రీ బాల గంగాధర్ తిలక్ బాల్యంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలు వివరించబడినవి.