భగవాన్ బాబా వారి దివ్యో పన్యాసము అనర్గళంగా కొనసాగుతున్నప్పుడు “ఒక చిన్న కథ” అన్న మూడు పదాలు భక్తులందరికీ శ్రవణానందాన్ని కల్గించటమే కాక వారి హృదయాలను పులకరింపజేస్తాయి. ఎందుకంటే వారి కథలు భక్తుల్లో జ్ఞాన ప్రకాశాన్ని కలిగించి, తాపాన్ని చల్లబరిచి, గిలిగింతలు కలిగించే హాస్యంతో కూడిన ఉపశమనాన్ని కలిగించే ఔషధం వంటివి.
“చిన్న కథ” ను మననం చేసుకుంటూ, దానిలోని సారాంశాన్ని అవగతం చేసుకున్నట్లయితే ఇది భగవాన్ విద్యా విధానంలో అత్యంత శక్తివంతమైన సాధనం అని బోధపడుతుంది.
భగవాన్ బాబా వారు కథలు, ఉపమానాలు ప్రసంగిస్తున్నప్పుడు వారి నుండి వెలువడే దివ్య ప్రేమ తరంగాలు భక్తులను చుట్టుముట్టాడుతాయి. ఈ దివ్య ప్రేమ తరంగాలు భక్తుల హృదయాలలో గూడుకట్టుకుని, వారి జీవిత విధానంలో మార్పు కలిగిస్తాయి.
*శ్రీ.ఎన్. కస్తూరి గారు (14.01.1978) స్వామి వారి చిన్న కథల గురించి ఈ విధంగా చెప్పారు*.
భగవాన్ బాబా వారి దివ్యోపన్యాసాలలో వివరించే ఈ చిన్న కథలు స్ఫూర్తిని కలిగించి, మానవులను ఉన్నత స్థితికి గొనిపోతాయి. ఇవి పిల్లలో ప్రేరణ కల్గించి, ప్రభావితులను చేస్తున్నందువలన బాలవికాస్ సిలబస్ లో చేర్చబడినవి. ఇవి వారికి అత్యున్నతమైన నైతిక విలువలతో కూడిన జీవితమును కొనసాగించుటకు తోడ్పడతాయి.
ఈ చిన్న కథలు ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా ముద్రింప బడతాయి. వీటిని అవగాహన చేసుకున్న వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తారు.
ఈ చిన్న కథలు ప్రతి ఒక్కరిలో నైతిక విలువలను గురించి ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడతాయి.
బాలవికాస్ పిల్లల వయస్సును మరియు వారి అవగాహన స్థాయిని అర్థం చేసుకుని బాలవికాస్ గురువులు ఈ చిన్న కథ ప్రథమ మరియు ద్వితీయ భాగంలోని కథలను, ఇటువంటి మరెన్నో కథలను బాలవికాస్ తరగతులలో వివరించవచ్చును.