ఐదు అంశాల్లో గైడెడ్ విజువలైజేషన్
పంచ భూతాలు ఐదు- అంతరిక్షం( అనగా ఆకాశం), నీరు, గాలి, అగ్ని,మరియు భూమి. ఈ ఐదింటినే పంచాభూతాలు అంటారు. వీటి ద్వారా జీవం, సృష్టి ఆవిర్భవించింది.
ఇవి అన్ని భారతీయ సాంప్రదాయాల్లో అంతర్భాగమై పూజింపబడతాయి. ఇవి సృష్టి మూలకాలు. జీవితానికి ఆలంబనగా ఉంటాయని నమ్ముతారు. మనం వాటిని గౌరవించాలి. ఇది చాలా ముఖ్యం. జీవితంలో సమతుల్యత, ప్రకృతిలో సమతుల్యత రెండూ ముఖ్యమైనవి, మరియు పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని, బాబా వారు చెప్పారు. వీటి మధ్య సమతుల్యత ఉన్నప్పుడు ప్రపంచంలో శాంతి ఉంటుంది.
గైడెడ్ విజువలైజేషన్ అనేది ఒక రకమైన ధ్యానం. ఇది పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. గురువు ఒక వస్తువు లేదా చిత్రాన్ని చూపించాలి. దాన్ని చూసి పిల్లలు తమ లోపల దృష్టి కేంద్రీకరించడం ద్వారా, వాటిని లోపల ఊహించుకుంటారు. వాటిలో విహరిస్తారు. పిల్లలను ఆలోచింపజేయడం, చిత్రాన్ని లేదా ఊహ ద్వారా చెప్పటం, వీటివలన ఆలోచనలను వాటితో ప్రయాణం చేయించడం గైడెడ్ టూర్. (మార్గ దర్శన యాత్ర).
దానినే నిశ్శబ్దంగా కూర్చోవడంద్వారా చేస్తారు. ఈ ఊహల్లో తేలియాడడానికి పిల్లలు ఇష్టపడతారు. ఉదాహరణకు అంతరిక్షం,మేఘాలు,అందమైన పుష్పాలు, పచ్చని పర్వతాలు, ప్రశాంతమైన సముద్రం, సూర్యోదయం,చంద్రోదయం, సంధ్యా సమయం, తోట, అడవి, ఉద్యానవనం,నది మొదలైనవి ఈ ప్రక్రియలో భావిస్తారు.
గైడెడ్ విజువలైజేషన్ పిల్లల్లో ఉత్పాదకత శక్తిని మరియు మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. విజయం, ఆనందం, ఆత్మవిశ్వాసం మొదలగు వాటిని కచ్చితంగా పెంచటానికి ఇది ఒక పాస్ పోర్ట్ లాంటిది.