ధర్మం అనేది మానవులు వారి అవసరాలకు అనుగుణంగానో, ఒత్తిడికి గురి అయిన క్షణంలో వారి అనుకూలానికి అనుగుణంగా మార్చుకునే విలువ కాదు.
ఇది మానవుల అంతఃశ్శాంతిని, భాహ్య శాంతిని మార్గనిర్దేశం చేయు ప్రాథమిక సూత్రం. సూర్యుడు మానవాళికి ప్రాణాధారమైన సూర్య శక్తిని విడుదల చేయకపోతే అది ఎంతో విపత్తును కలిగిస్తుంది. అలాగా శాంతి కి దారి చూపి నియమబద్ధ ప్రవర్తన (ధర్మం) అన్నది మనకు ప్రకృతి నిర్దేశిస్తున్నది.
“భగవంతుడు భావ ప్రియుడు” అనే కథ ద్వారా, ధర్మాచరణ, శాంతి అనే రెండు విలువలు తెలుసుకోవచ్చు.