సత్య ధర్మాలను గురించిన కథలు ఎన్నో పొందుపరచబడినాయి.
సత్యాన్ని ఆచరిస్తే అది ధర్మం అవుతుంది. సత్యం వాక్కు ద్వారా వ్యక్తీకరించబడితే, ధర్మం ఆచరణ ద్వారా వ్యక్తం అవుతుంది. ధర్మం అనేది సత్యం పై ఆధారపడి ఉంటుంది. సత్యం లేకుండా ధర్మం ఉండదు. “సత్యం” పునాది లేకుండా “ధర్మం” అనే సౌదా నిర్మించలేము.
“ఏది వ్యర్థం కాదు” అనే కథ ద్వారా ‘విచక్షణ’(సత్యం) ‘నిజాయితీ’(ధర్మం) అన్ని విలువలు తెలుసుకోవచ్చును.