నళీనీదళగత జలమతి

ఆడియో
సాహిత్యం
- నళీనీదళగత జలమతి తరళం
- తద్వజ్జీవిత మతిశయ చపలం|
- విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం,
- లోకం శోకహతం చ సమస్తం||

భావము
తామరాకుపై నీటిబొట్టు ఎంత కొద్దికాలంలో అదృశ్యమైపోతుందో, ఉన్నంత కాలము ఎంత అస్థిరముగా వుంటుందో, అంత అస్థిరమైనది, క్షణికమైనది ఈ మానవ జీవితం.
మానవజీవితం వ్యాధి బాధలతో, అభిమానవు తెగుళ్లతో సహించడానికి దుర్భరంగా వుంటుంది. లోకమంతా శోకమయం అని అనిపిస్తుంది. మానవుని జీవితం ఎప్పుడు రాలిపోతుందో కూలిపోతుందో తెలియదు. జీవించినంత కాలం ఏదో ఒక బాధ, చింత, భయాందోళనలతో గడుపుతాడు మానవుడు.
వివరణ
నళినీదళగత | తామరాకుమీద |
---|---|
జలం | నీటి బిందువు |
అతి | అధికముగా |
తరళం | చలించునట్టిది |
తద్వత్ | ఆ విధముగానే |
జీవితం | జీవితము కూడ |
అతిశయ | మిక్కిలి |
చపలమ్ | అస్థిరమైనది. |
విద్ధి | తెలుసు కొనుము |
వ్యాధి | రోగముచేత |
అభిమాన | రాగద్వేషములచేత |
గ్రస్తం | కబళింపబడుతుంది |
లోకం | ప్రపంచము |
శోక | దుఃఖముతో |
హతం | నశింపచేయును |
చ | మరియు |
సమస్తం | సంపూర్ణము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty