కర్మణ్యేవాధికారస్తే
ఆడియో
శ్లోకము
- కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన।
- మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి।।
తాత్పర్యము
నీకు కర్మ చేయుటయందే అధికారము కలదు. కర్మఫలములు ఆశించుట యందు ఏనాడు నీకు అధికారము లేదు. కర్మఫలములకు కారణభూతుడవు కాకుము (నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు). మరియు కర్మలు మానుట యందును నీకు ఆసక్తి కలుగకుండుగాక (అలాగని అసలు కర్మ చేయుట వదలకూడదు).
వివరణ
కర్మణి | కర్మాచరణమునందే/ కర్మ చేయుటలో |
---|---|
ఏవ | మాత్రమే |
అధికారః | హక్కు, అధికారము ఉంది |
తే | నీకు |
మా | లేదు |
ఫలేషు | ఆ కర్మ ఫలముల యందు |
కదాచన | ఎప్పుడూ కూడా (మా+ కదాచన= ఎప్పటికీ లేదు) |
మా | లేదు/ కాదు/ వలదు |
కర్మ ఫల | కర్మఫలములు/ ఫలితములు |
హేతుః | కారణము |
భూః | అవును (మా భూః -అవవద్దు / కాకుము) |
మా అస్తు | ఉండ కూడదు |
తే | నీ యొక్క |
సంగః | ఆసక్తి |
అస్తు | ఉండుట |
ఆకర్మణి | కర్మను మానుటయందు/ కర్మను చేయకుండా ఉండుటలో |
Overview
- Be the first student
- Language: English
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి