శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
ఆడియో
శ్లోకము
- శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః|
- జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ||
తాత్పర్యము
ప్రగాఢమైన శ్రద్ధా విశ్వాసములు కలవారు (శ్రద్ధ కలవారు, గురు భక్తి కలవారు) మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసినవారు జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్ఠమైన జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.
ఆత్మజ్ఞానము పొందగోరేవారు జ్ఞానం పొందే వరకు కర్మలు ఆచరించాలి. జ్ఞానమును పొందిన వారు కర్మలతో కర్తవ్యములతో పని లేకుండానే శీఘ్రముగానే పరమ శాంతిని (ముక్తిని) పొందుతారు. బ్రహ్మ జ్ఞానానికి కర్మ ఫలాలు నశిస్తాయి అని అర్జునునికి శ్రీకృష్ణుడు జ్ఞానము యొక్క గొప్పదనాన్ని వివరించాడు
వివరణ
శ్రద్ధావాన్ | శ్రద్ధ గలవాడు |
---|---|
లభతే | పొందుతాడు |
జ్ఞానం | బ్రహ్మ జ్ఞానాన్ని |
తత్పరః | సాధనా పరాయణుడు |
సంయత | నియంత్రణ కలిగి |
ఇంద్రియః | ఇంద్రియములు |
జ్ఞానం | జ్ఞానాన్ని |
లబ్ధ్వా | పొంది |
పరం | పరం అత్యున్నతమైన |
శాంతిం | శాంతిని |
అచిరేణ | తత్ క్షణమే |
అధిగచ్ఛతి | పొందుతాడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty