తస్మాదసక్తః సతతం

ఆడియో
శ్లోకము
- తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
- అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ।।
తాత్పర్యము
కర్మఫలము మీద ఆసక్తి లేకుండా కర్మలు చేసే మానవుడు మోక్షము పొందుతాడు. కనుక నీవు ఫలము మీద ఆసక్తిని వదిలి కర్మలు ఆచరించు.
మమకారాసక్తులను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.

వివరణ
తస్మాత్ | కాబట్టి |
---|---|
అసక్తః | ఆసక్తి రహితుడవై (మమకారము లేకుండా) |
సతతం | ఎల్లప్పుడూ |
కార్యం | చేయదగిన కర్తవ్యమును |
కర్మ | పనిని, కర్మను |
సమాచర | నిర్వర్తించుము |
అసక్తః | ఆసక్తి రహితుడవై (మమకారం లేకుండా) |
హి | నిజముగా |
ఆచరన్ | ఆచరిస్తూ, ఆచరించుచున్న |
పరం | ఆ పరమాత్మ |
ఆప్నోతి | పొందును |
పూరుషః | వ్యక్తి |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
వివరణ