“గు “అంటే చీకటి “రు “అంటే పారద్రోలడం గురు అంటే చీకటిని పార ద్రోలడం.
ప్రేమ యొక్క సంపూర్ణతను అనుభవించాలంటే హృదయాన్ని ప్రేమతో నింపాలి. అప్పుడే భక్తికి ఫలితం ఉంటుంది. గురువు అనే పదానికి “గు” అనగా గుణాతీత “రు” అనగా రూప రహితుడు ,అంటే గుణాలకు అతీతుడు, రూప రహితుడు అని ఇంకొక అర్థం. గుణాతీతుడు రూపరహితుడు అయిన గురువును, భగవంతుని ఏ మృత్యువు అధిగమించలేదు. అనగా గురువే దైవం. ఆయన జ్ఞానోదయం కలిగించి ముందుకు నడిపించడానికి మీ హృదయంలో కుడి వైపు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు ,సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు .- బాబా.
శిష్యుని లోని అజ్ఞానాన్ని తొలగించి, ఇంద్రియాలకు, మనసుకు క్రమశిక్షణ నేర్పే సర్వోన్నత స్వరూపుడు గురువు. సంసారం అనే సంకెళ్ల నుంచి విముక్తి పొందినప్పుడు అతను లేదా ఆమె లోపల ఉన్న భగవంతుని చూడగలుగుతారు.
ఈ గురు భజనలను పాడుతూ మన జగద్గురువు సత్యసాయిబాబాను ప్రార్థిద్దాం.