గోష్టులు, చర్చా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. ఇది మేధస్సును పెంచడానికి విద్యార్థులకు, గురువులకు కూడా ఒక మంచి అవకాశం. ఈ చర్చా కార్యక్రమాలను బాలవికాస్ కేంద్రాలలోను, సమితి స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోని నిర్వహించవచ్చు.
కార్యక్రమాలను నిర్వహించుటకు సిలబస్ లో ఉన్న అంశాలను ఎంచుకోవాలి. సిలబస్ లోనిది అయినా ఆ టాపిక్ కు సంబంధించిన దానికన్నా ఎక్కువగా జ్ఞానాన్ని ఆర్జించేలా ప్రోత్సహించాలి. గురువులు వారికి సత్య సాయి బోధనామృతం, వాహినిలు మరియు ఇతర సాయి సాహిత్యం నుండి సూచించబడిన పుస్తకాలను పిల్లలకు అందించాలి. కే సాయి మీడియా సెంటర్ నుండి ప్రసారమైన వివిధ కార్యక్రమాలను ,సూచించిన ఎపిసోడ్ లను కూడా వారికి సూచించవచ్చు. పిల్లలు వాటిని అధ్యయనం చేసే సమయంలో ఒక మోస్తరుగా సహాయం అందించవలసి ఉంటుంది.
పిల్లలు బాల వికాస్ క్లాసులో నేర్చుకున్న విషయాలపై పట్టు సాధించిన తర్వాత మీడియా సెంటర్లో ప్రసారం చేయబడిన ఏదైనా ఒక చర్చ కార్యక్రమం యొక్క ఆడియోని వినమని గురువులు చెప్పవచ్చు .దాని గురించి మాట్లాడవచ్చు లేదా చర్చించవచ్చు.
ఈ కార్యక్రమాలలో ఒక్కొక్కసారి పిల్లలలోని పోటీ తత్వం కారణంగా అపార్ధాలు కలుగవచ్చు. కాబట్టి చర్చలు జరిగేటప్పుడు ముగింపు సమయంలో పిల్లలు నిరుత్సాహపడకుండా అహంకారం పెంచుకోని విధంగా గురువులు జాగ్రత్త తీసుకోవాలి. చివరగా గురువు చర్చని క్లుప్తంగా వివరించాలి. పిల్లలు సాయి సాహిత్యాన్ని తప్పకుండా చదవమని, సమితిలోని స్టడీ సర్కిల్‌కి హాజరయ్యేలా ప్రోత్సహించాలి.
చర్చా కార్యక్రమాలకు ఏదైనా ఒక అంశం ఎంపిక చేసే ముందు రెండు వైపులా చర్చకు అనుకూలంగా ఉండాలి . చర్చలు ఇంకొకరిని బాధ పెట్టేదిగా విమర్శించేదిగా, వితండ వాదనగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. న్యాయ నిర్ణేతగా ఉన్నవారు చర్చకు వచ్చే అన్ని ప్రధాన అంశాల ప్రాముఖ్యత వివరించాలి .ముగింపు ఏకపక్షంగా ఉండకూడదు .ఇది చర్చ అయినప్పటికీ ఒక బృందం కంటే మరొక బృందం మెరుగ్గా చేసినప్పటికీ చర్చలోని అన్ని అంశాలు సమానంగా ముఖ్యమైనవి అని గురువులు తెలియజేయాలి. గురువు కూడా చర్చనీయాంశాలు బాగా అధ్యయనం చేయాలి. తద్వారా పిల్లలు సమర్థవంతంగా చెప్పలేనప్పుడు గురువు వారి భావాలను అందరికీ అర్థం అయ్యేలా వివరించగలరు.
గోష్టి /చర్చా కార్యక్రమాల కోసం కొన్ని అంశాలు:
- 5Ds
- 5HVs
- 4Fs
- 3Ps
- నామస్మరణ
- రామాయణం
- శ్రీ మద్భాగవతం
- మానవ సేవయే మాధవ సేవ
- దైవ ప్రీతి,పాప భీతి,సంఘనీతి
- ప్రార్థన దాని ప్రాముఖ్యత
- యోగుల జీవితాలు వారి బోధనలు
- మత సమైక్యత
- దేశభక్తి
- పంచ మహా యజ్ఞాలు
- ధర్మో రక్షతి రక్షితః
- పంచ మాతలు
- శాఖాహారం
- నవవిధ భక్తులు
Fచర్చల కోసం క్రింది అంశాలను ఉపయోగించవచ్చు:
- జ్ఞాన యోగ vs కర్మయోగ vs భక్తియోగ.
- సుగ్రీవ -విభీషణులు
- ఆంజనేయుడు- విభీషణుడు
- గోపికలు – పాండవులు
పైన సూచించిన అంశాలు కేవలం సూచిక మాత్రమే. గురువు ఇలాంటి అంశాలను ఎంచుకోవచ్చు .అయితే పిల్లలను దానికోసం సిద్ధం చేయడం సాధ్యమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి.