సేవ ఒక అత్యున్నత ఆధ్యాత్మిక సాధన. భగవంతుని ప్రేమించడానికి ఉత్తమ మార్గం అందరిని ప్రేమించడం మరియు అందరిని సేవించడం.
పిల్లలను చిన్ననాటి నుంచి సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా చేసినట్లయితే వారికి సేవ యొక్క విలువ, ప్రాముఖ్యత తెలుస్తుంది. సేవ చేయడం ద్వారా వారు వారి సమయాన్ని, శక్తిని, వారిలోని నైపుణ్యాన్ని ఇతరుల కొరకు ఉపయోగించడం తెలుసుకోగలుగుతారు. దాని ద్వారా పొందే సంతృప్తిని అనుభవించగలుగుతారు. ఇది వారిలో పరివర్తనను తీసుకువస్తుంది. వారిలో వినయం, సానుభూతి, నిస్వార్ధత, సంతృప్తి, త్యాగం, ఐక్యత పెంపొందుతాయి.
గ్రూపు 3లోని బాలవికాస్ పిల్లలకు తగిన సేవా కార్యక్రమాలకు అవకాశాలను అందించడంలో బాలవికాస గురువులకు కొన్ని మార్గదర్శకాలు క్రింద ఇవ్వబడ్డాయి.