శ్రీ సత్యసాయి బాలవికాస్ అనునది మానవుని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసమునకు దోహదపడు ఉపకరణము. పిల్లలలో ఆధ్యాత్మిక బీజములు నాటి, సత్శీలవంతులుగా తీర్చిదిద్ది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వమునకు వారసులుగా తయారు చేసి, సకల ప్రాణి కోటిని ఏకత్వంతో గౌరవించే ఉత్తమ పౌరులుగా సమాజమునకు అందించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రారంభించారు.
శ్రీ సత్య సాయి బాలవికాస్ ప్రపంచ పునరుద్ధరణ కొరకు మరియు విలువలతో కూడిన వ్యక్తిగత జీవనమునకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు రూపొందించిన ఒక బృహత్తర కార్యక్రమము. ప్రతి బాలవికాస్ తరగతి ఈ క్రింద తెలిపిన అయిదు బోధనాపద్దతుల ద్వారా నిర్వహించు సమయం వారమునకు ఒకసారి ఒక్క గంట మాత్రమే.