heading-logo
శ్రీ సత్యసాయి బాలవికాస్ పర్యావలోకనం
Five Values Banner

శ్రీ సత్యసాయి బాలవికాస్ అనునది మానవుని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసమునకు దోహదపడు ఉపకరణము. పిల్లలలో ఆధ్యాత్మిక బీజములు నాటి, సత్శీలవంతులుగా తీర్చిదిద్ది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వమునకు వారసులుగా తయారు చేసి, సకల ప్రాణి కోటిని ఏకత్వంతో గౌరవించే ఉత్తమ పౌరులుగా సమాజమునకు అందించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రారంభించారు.

శ్రీ సత్య సాయి బాలవికాస్ ప్రపంచ పునరుద్ధరణ కొరకు మరియు విలువలతో కూడిన వ్యక్తిగత జీవనమునకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు రూపొందించిన ఒక బృహత్తర కార్యక్రమము. ప్రతి బాలవికాస్ తరగతి ఈ క్రింద తెలిపిన అయిదు బోధనాపద్దతుల ద్వారా నిర్వహించు సమయం వారమునకు ఒకసారి ఒక్క గంట మాత్రమే.

పాఠ్యాంశముల ప్రత్యేకత

ఇందులో 5 సంవత్సరముల నుండి 13 సంవత్సరముల మధ్య ఉన్నటువంటి పిల్లలకు మూడు వర్గములలో (గ్రూపులలో) రూపొందించినటువంటి 9 సంవత్సరముల కార్యక్రమము. ప్రేమ మరియు అహింసలను పిల్లలు బాల్యంలోనే నేర్చుకొని వారు జీవితములో ఆచరించునట్లు చేయుట.

Group I: 5 To 7 Years

ప్రతి విద్యార్థికి నేర్చుకునే దశ ఇది. “తొందరగా బయలుదేరు, నెమ్మదిగా ప్రయాణించు, క్షేమంగా చేరు” ఇది శిక్షణ బాలా దివ్య సూక్తి. ఆ ఉద్దేశంతో బాలవికాస్ కార్యక్రమమును 5 ఏండ్ల వయసు గల బాల,బాలికలకు ప్రారంభిస్తారు. చిన్న వయసులో నేర్చుకొన్న విషయాలు జీవితమంతా గుర్తుండి వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అందుకే బాలవికాస్ గురువులు ఆటలు, పాటలు, బృంద కార్యక్రమాలు, కథలు, ప్రార్థనలు, మౌనంగా ఉండుట, మొదలైన పద్ధతుల ద్వారా విధ్యార్థి వికాసానికి ప్రయత్నించాలి. పాఠాలు, ఉపన్యాసాలు ఈ దశలో ఉపయోగపడవు.

Group II: 8 To 10 Years

ప్రతి పని పద్ధతి ప్రకారం చేయుట నేర్చుకునే దశ ఇది. మొదటి దశలో నేర్చుకున్న విషయాలు ఈ దశలో చక్కని రూపు దిద్దుకుంటాయి. ఆటలు, పాటలు ఈ దశలో ఉపయోగపడవు. తనలో పెరిగే జిజ్ఞాస, కుతూహలం, ఆలోచనలకు అవసరమైన వాతావరణం కావాలి. మనస్సును, ఆలోచనలను నిగ్రహించుకునే శక్తి కావాలి. మాటలకు, చేతలకు పొంతన కుదిరే పరిస్థితికి బీజం పడాలి. బాల వికాస్ గురువులు ఈ దశలో పిల్లల ఆశయాలను, ఊహలను సజీవంగా ఉంచేందుకు తోడ్పడాలి.

Group III: 11 To 13 Years

ఈ వయస్సు ప్రణాళికా బద్ధమైన కార్య సాధనకు అనుకూలము. తాము నేర్చుకున్న మానవతా విలువలు నిత్య జీవితపు సంఘటనలకు ఆపాదించుకొను కాలమిది. తాము నేర్చుకున్న విషయాలను ఆచరించుటకు ఈ దశలో ప్రయత్నిస్తారు. గురువు వివిధ మార్గముల ద్వారా ఆ అవకాశాలను కల్పించాలి. ఈ దశలో గురువు ఒక గురువుగా లేక తల్లిగా మాత్రమే కాక స్నేహితుడిగా, ఆప్తుడిగా విద్యార్థి మనసెరిగి ప్రవర్తించాలి.

పాఠ్య ప్రణాళిక ముఖ్యాంశాలు
(మూడు సంవత్సరములకు)
  • వివిధ దేవతా మూర్తుల చిన్న చిన్న ప్రార్థనా శ్లోకములు.
  • విలువలతో కూడిన కథలు.
  • వివిధ దేవతామూర్తుల నామములతో భజనలు/ ప్రాంతీయ గీతములు
  • భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదర్శ జీవిత పరిచయము.
(రెండు అంకెల వయస్సు ప్రగతి బాటకు సోఫానము)
  • భగవద్గీత మరియు నుండి ఎంపిక చేసిన కొన్ని శ్లోకములు
  • రామాయణ మరియు మహా భారతము వంటి పురాణ గాధలనుండి కొన్ని అంశములు
  • వివిధ దేవతామూర్తుల నామములతో భజనలు/ ప్రాంతీయ గీతములు
  • మత సమైక్యత మరియు వివిధ మత ప్రవక్తల/ సన్యాసుల కథలు
  • మతసమన్వయము
  • భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదర్శ జీవితము- భోధనలు
(టీనేజ్ ద ట్రిక్కి ఏజ్)
  • భగవద్గీత మరియు భజగోవిందముల నుండి ఎంపిక చేసిన కొన్ని శ్లోకములు.
  • ప్రాంతీయ మహా పురుషులు మరియు గొప్ప వారైన శ్రీ రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానందల జీవితములు
  • భజనలు/ భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతల మీద ప్రాంతీయ గీతములు
  • శ్రీ సత్య సాయి సేవా సంస్థలలో మానవ సేవను పరిచయం చేయుట మరియు వారే స్వయంగా సేవా కార్యక్రములలో పాల్గొనునట్లు చేసి ఆనందమును అనుభవింప చేయుట.
బాలవికాస్ యొక్క ప్రధాన లక్ష్యం పరివర్తననే కానీ విషయ పరిజ్ఞానం కాదు.
  • శ్రీ సత్య సాయి బాలవికాస్ యెక్క ఆదర్శము తరతరాలుగా స్వచ్ఛమైన అంతరాత్మ కలిగిన బాల బాలికలను పెంపొందించుట.
  • విద్యార్థులలో అంతర్గత పరివర్తన కలిగించటమే బాలవికాస్ ప్రధాన లక్ష్యం అంతేకానీ, పిల్లలలో ఒత్తిడిని కలిగించే విషయ పరిజ్ఞానాన్ని అందించుట కాదు.
  • వీరి ప్రరివర్తనలో కలిగే మార్పులను ప్రోగ్రెస్ కార్డులు యందుకానీ, అసైన్మెంట్ షీట్లయందు కానీ కనపడదు. ఈ మార్పు పిల్లల లోపలే కాక, వారి చుట్టూ పరిసరాలను ప్రభావితం చేసి సామారస్య వాతావరణం ఏర్పరుస్తుంది. అది రోజు రోజుకు వారిలో అనూహ్యమైన మార్పును కలిగించటం మనం గమనించవచ్చు.
  • ప్రతి వారము బాలవికాస్ తరగతికి క్రమం తప్పకుండా హాజరగు విద్యార్థులకు క్రింద ఇచ్చిన విధంగా సానుకూల ప్రరివర్తనా మార్పులు ప్రతిబింబిస్తాయి.
శ్రీ సత్యసాయి బాలవికాస్ ప్రధమ వర్గము (గ్రూప్ 1) పూర్తి అయ్యాక
  • బాల బాలికలు వస్త్రధారణ చక్కగా ఉండి బాలవికాస్ నిర్వహించు తరగతిలో వేర్వేరుగా వారికి కేటాయించిన ప్రదేశంలో కూర్చోవాలి.
  • తరగతి గది బయటి వైపు పాదరక్షలు ఒక క్రమంలో ఉంచాలి. ఇదే విధమైనటువంటి క్రమశిక్షణను వారి ఇంటిలో / తరగతి గదిలో అలవరచుకొనునట్లు చూచుట
  • తల్లిదండ్రుల పట్ల గౌరవం
  • రాత్రి కనీసం మూడుపూటల భగవంతున్ని ప్రార్థించునట్లు చేయుట.
  • పంచుకొనుట మరియు సంరక్షించుట వంటి విలువలను బోధించుట.
శ్రీ సత్య సాయి బాలవికాస్ రెండవ వర్గం(గ్రూప్-2) పూర్తి అయ్యాక
  • భగవద్గీతలో బోధించిన ప్రతి అంశములను వారి దైనందిన జీవితములో ఆచరిస్తారు. వివిధ మతముల ఆచారములను సంప్రదాయములను తెల్సుకొంటారు. వారి పండుగలు మరియు ఉత్సవములలో పాల్గొని సర్వమత సమన్వయమును పాటిస్తారు.
  • అన్ని మతాల పండుగల ముఖ్య ఉద్దేశ్యాలను వాటిని అభ్యసించు విధానాన్ని అర్థం చేసుకొని ప్రశంసించుట.
  • వారిలోని అంతర్వాణి ని గమనించి మంచి చెడుల మధ్యన విచక్షణా జ్ఞానమును అభివృద్ధి చేసుకొంటారు.
  • ‘డ’ కార పంచకము అయిన (i) భక్తి (Devotion) (ii) విచక్షణ (Discrimination) (iii) క్రమశిక్షణ (Discipline) (iv) పట్టుదల (Determination) మరియు (v) కర్తవ్యము (Duty) లను వారి నిత్య జీవితంలో ఆచరిస్తారు.
  • భగవంతుడే మనకు గురువు మరియు మార్గదర్శకుడు అన్న విషయమును అంగీకరించి ప్రతి క్షణం గమనిస్తున్నాడనే ఎరుకను కల్గి ఉంటారు.
శ్రీ సత్య సాయి బాలవికాస్ మూడవ వర్గం(గ్రూప్-3) పూర్తి అయ్యాక
  • లక్ష్యమును తెల్సుకొనే విధంగా ఆలోచిస్తారు (భజగోవిందం శ్లోకముల నుండి)
  • జీవితంలో వెంటాడుతున్న మరియు ముసుగులో ఉన్న జీవిత పరమార్థమును వివిధ పద్ధతుల ద్వారా అన్వేషిస్తారు ( భజ గోవిందం శ్లోకముల ఆధారముగా)
  • జన్మ భూమిలో తాను పొందిన ఆనందమును దేశ భక్తితో గర్వంగా చాటి చెప్పునట్లు తయారు అవుతారు. వివిధ రకముల సామాజిక సేవల ద్వారా సమాజ దృష్టి అభివృద్ధి అవుతుంది.
  • కోరికల అదుపు పై సాధన.
  • శ్వాస నియంత్రణ మరియు సమయ నిర్వహణ వంటి వాటిని పాటిస్తూ వారి విధులను పాఠశాలలో, గృహములలో మరియు సమాజములో సక్రమంగా నిర్వహించి వ్యక్తిగత అభివృద్ధి సాధిస్తారు.
  • అంతర్ దృష్టిని గమనిస్తూ ఐక్యత మరియు పవిత్రతల మధ్య ఉన్న సంబంధమును తెల్సుకొని కోర్కెలపై అదుపును పాటిస్తూ తద్వారా దేశము యొక్క పురోభివృద్ధికి దోహదపడతారు.
  • సమాజ సేవలో పాల్గొనడం ద్వారా సామాజిక స్పృహను మేల్కొలుపుట.
  • జీవితం ఒక ఆట – ఆడు మరియు జీవితం ఒక సవాలు- ఎదుర్కో వంటి వాటిని ఆచరించి ఎటువంటి సమస్యను అయినా ఎదుర్కొనే ధైర్యము, నాయకత్వ లక్షణములు అలవడుతాయి. అంతే కాక “అహం బ్రహ్మాస్మి” వంటి మహా వాక్యములను కూడా తెల్సుకొని ఆచరిస్తారు.

పైన తెలిపిన విధముగా భగవానుడు రూపిందించిన ఈ కార్యక్రమములో ఒక్కొక్క వర్గములో ఒక్కొక్క విధముగా పరివర్తన తెప్పించే అంశములు ముఖ్యమైనవి. శ్రీ సత్య సాయి బాలవికాస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ప్రతి పిల్లవానిలో మానవతా విలువల ద్వారా వారి వ్యక్తి గత నైపుణ్యములను అభివృద్ధి చేస్తూ దైనందిన జీవితంలో ఆచరించుట ద్వారా వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక మరియు విశ్వ శాంతికి సహకరించునట్లు చేయుట.

  • మానవతా విలువలను పెంపొందించుకొనుట
  • వాటిని నిత్యజీవితంలో ఆచరించటానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొనుట
  • తద్వారా వ్యక్తిగత, కుటుంబ, సమాజ మరియు జాతీయ సామరస్యాన్ని పెంపొందించటానికి దోహద పడుతుంది.

“శ్రీ సత్యసాయి సంస్థల విశ్వజనీన లక్ష్యంలో భాగంగా శ్రీ సత్య సాయి బాలవికాసు తరగతులు నేటి విద్యార్థులను రేపటి సమాజమునకు కరదీపికలుగా, విచారణ మరియు ఆత్మసాక్షాత్కారం వైపు దారి చూపుతాయి. ఈ సేవ భగవంతుడు ఇచ్చిన మహాద్భాగ్యంగా భావించుట చేత బాలవికాస్ తరగతులకు ఎటువంటి రుసుము చెల్లించబడదు.”

తొమ్మిది సంవత్సరాల బాలవికాస్ శిక్షణ నిబద్ధతతో పూర్తి చేసిన విద్యార్థులకు “డిప్లమా ఇన్ శ్రీ సత్య సాయి ఎడ్యుకేషన్” సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.

శ్రీ సత్య సాయి బాలవికాస్ కార్యక్రమములో తల్లిదండ్రుల పాత్ర

ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలకారణం మానవతా విలువల కంటే భౌతిక విద్యలకు ప్రాధాన్యత ఇవ్వటమే. ఈ దురదృష్టకరమైన పరిస్థితి నుంచి ప్రపంచ వ్యాప్తంగా యువతను కాపాడుటకై శ్రీ సత్యసాయి బాలవికాస్ కార్యక్రమమే సరియైన సమాధానం. శ్రీ సత్యసాయి బాలవికాస్ కార్యక్రమం లో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమైనది. శ్రీ సత్యసాయి సంస్థలు తల్లిదండ్రులకు నిర్వహించే శిక్షణా తరగతులు, అవగాహనా సదస్సులు వారిని అప్రమత్త పరిచి ప్రసార మాధ్యమాలు, వినియోగదారుల వివాదాస్పదాలకు ప్రభావితం కాకుండా తమ పిల్లలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాయి. తల్లిదండ్రులు మానవతా విలువలను పెంపొందించే శిక్షకులుగా తమ పాత్ర నిర్వహించేందుకు దోహదం చేస్తాయి. అందువల్ల తల్లిదండ్రులు కనీస బాధ్యతతో పైన పేర్కొన్న అంశాలపై నిబద్ధత కలిగి ఉంటే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది:

  • పిల్లలు 9 సంవత్సరములు ఖచ్చితంగా పాల్గొనునట్లు చూడాలి.
  • ప్రతి వారము చివరలో మీ పిల్లలు బాలవికాస్ తరగతులకు క్రమశిక్షణతో హాజరు అగునట్లు చూడవలెను.
  • బాలవికాస్ కార్యక్రమము మీద నమ్మకం కల్గి ఉండాలి.
  • తరగతిలో నేర్చుకొన్న విలువలను ఇంటిలో పాటించునట్లు చూడవలెను.
  • ఈ ఉచిత సేవ యొక్క గొప్పదనమును అర్థము చేసుకొనవలెను.
  • అప్పుడప్పుడు గురువులతో మీ అమూల్యమైన అభిప్రాయములను తెలియజేయుట
  • బాలవికాస్ అభివృద్ధి పథములో నిర్వహించు తల్లిదండ్రుల సమావేశములలో పాల్గొనుట- చర్చించుట
  • కుటుంబంలో ఉన్న సత్సంబంధములను మెరుగుపరచే కార్యక్రమములలో పాల్గొనుట.
వ్యక్తిగత సంపూర్ణ మరియు సమగ్ర అభివృద్ధి

ఈ విధంగా శ్రీ సత్య సాయి బాలవికాస్ కార్యక్రమము పిల్లలో ఈ క్రింద తెలిపిన విధముగా ఐదు అంశములలో సమగ్ర అభివృద్ధిని సూచిస్తుంది.

  • శారీరక అభివృద్ధి
  • మేథో అభివృద్ధి
  • భావోద్వేగముల అదుపు
  • మానసిక అభివృద్ధి
  • ఆధ్యాత్మిక పురోగతి అభివృద్ధి

ఈ విధమైనటువంటి శ్రీ సత్య సాయి బాలవికాస్ కార్యక్రమము ప్రతి ఒక చిన్నారులలో మానవతా విలువలతో కూడిన సమగ్ర అభివృద్ధిని గావించి వారిని దివ్యాత్మ స్వరూపులుగా తీర్చి దిద్దుతుంది. అంటే కాకుండా వారు నేర్చుకొన్నటువంటి విలువలను వారి నిజ జీవితంలో ఆచరించునట్లు చేస్తుంది. శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్ ద్వారా భగవాన్ బాబా మనకు అందించే సందేశము ఇదే.

మనము చేతులు కలిపి కలసి మెలసి పనిచేద్దాం....

Imagae reference: Sai Spiritual Education Teacher’s Manual, USA – 3rd edition, Revision 20211

#iguru_dlh_6750993a39e94 .dlh_subtitle {color: #114c56;}#iguru_dlh_6750993a3f1ce .dlh_subtitle {color: #ffa64d;}#iguru_dlh_6750993a4692e .dlh_subtitle {color: #ffa64d;}#iguru_dlh_6750993a47cf8 .dlh_subtitle {color: #ffa64d;}#iguru_dlh_6750993a52064 .dlh_subtitle {color: #ffa64d;}#iguru_dlh_6750993a52780 .dlh_subtitle {color: #ffa64d;}#iguru_dlh_6750993a52e9f .dlh_subtitle {color: #ffa64d;}