ప్రేమ యొక్క నైతిక విలువయే అహింస. సత్య ధర్మ శాంతి ప్రేమల అంతర్వాహిని అహింస. సమస్త జీవరాశుల పట్ల ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉండటమే అహింస. మానవులు, జంతువులు, మొక్కలు, సరస్సులు, నదీనదాలు, పర్వతాలు అన్నీ కూడా అవిభాజ్యమైన పరిపూర్ణ దివ్యత్వం లోనివే అని తెలుసుకోవడమే “అవగాహన” అందురు.
ప్రేమ +అవగాహన =అహింస. వీధిలో వెళ్తున్న ఒక అంధుడు మనల్ని ఢీ కొడితే, వారు తమకు తెలియక చేసిన పని కనుక మనం వారిని నిందించలేము. క్షమించగల్గుతాము. ఈ విధమైన వైఖరి వలన హింసాత్మకంగా ప్రతిస్పందించే కోరికను వీడ గలుగుతాము. దాని వలన ఇతరులు మనకు ఎటువంటి అవమానాన్ని కలిగించిననూ సహించే ఓర్పును పెంపొందించుకో గలుగుతాము. సమస్త సృష్టి యొక్క ఏకత్వాన్ని గురించి అవగాహన లేకపోతే ఇతరుల తప్పులను క్షమించలేము.
“ఏది వ్యర్థం కాదు” అన్న కథ అహింస అనే విలువను తెలియజేస్తుంది.