దృశ్య రూప దర్శకం తో ప్రకృతి బోధన
నదీ జలాల్లోని నీటి బిందువులను ఎలా లెక్కించలేమో అలాగే మన లోని ఆలోచనలు, కార్యాలు అసంఖ్యాకం. నదీ ప్రవాహం పై మనం కొద్ది పాటి నియంత్రణ కలిగి ఉంటాం. జల ప్రవాహం వేగంగా పెద్ద బండ రాళ్ళను సైతం తన మార్గం నుంచి నెట్టి వేస్తుంది కానీ అదే ప్రవాహాన్ని కూడా చిన్న రాయితో అడ్డు కోవచ్చు దారి మళ్లించవచ్చు. అదేవిధంగా మన ఆలోచనా ప్రవాహాన్ని ఆపగలిగే అద్భుతం మౌనం.
అవిశ్రాంతంగా పనిచేసే గుండెకు సైతం హాయి నిచ్చేది మౌనం తప్ప మరొకటి లేదు అంటారు బాబా. మౌనం అనేక ప్రక్రియల ద్వారా అనుభూతి చెందవచ్చు. మౌనంగా కూర్చుని దీనిని తెలుసుకోవచ్చు.
దృశ్య రూపంలో చూపించి 12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రకృతి పట్ల అవగాహన మార్గదర్శకం తో ప్రభావితం చేయగలం ఈ గైడెడ్ విజువలైజేషన్ (దృశ్య రూప మార్గం) ద్వారా పిల్లలు అవగాహన చేసుకొని వాటిలో నిమగ్నం కావడానికి ఎంతో ఉపయోగకరం. ప్రకృతి లోని ఏ పదార్థం గురించి ఆయినా స్పష్టంగా వివరించవచ్చు పిల్లలు వాటి గురించి తేలికగా స్పష్టం గా ఊహించుకుంటారు.
జ్యోతి ధ్యానం కూడా ప్రపంచంలో ఒక గురుతరమైన ధ్యాన ప్రక్రియ. జ్యోతి ప్రకాశం ఎలాగైతే అంతటా ప్రసరిస్తుందో అదే విధంగా ప్రేమను, ఏకత్వాన్ని అంతర్గతంగా బాహ్యంగా ప్రసరింప చేయవచ్చు. తర్వాత సంవత్సరాలలో పై గ్రూప్ లకు కూడా దీన్ని ప్రయోగించి అవగాహన కలిగించగలం దృశ్యనీయ ప్రదర్శన.