పూర్వం రామ
ఆడియో
పంక్తులు
- పూర్వం రామ తపోవనాది గమనమ్ హత్వామృగం కాంచనం
- వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం
- వాలీ నిర్దలనం సముద్ర తరణం లంకాపురీ దహనం
- పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ హి రామాయణం.
అర్ధము
శ్రీరాముడు, తండ్రికి కైకకు ఇచ్చిన మాటలను నిలుపుటకు అరణ్యముల కేగెను. అచట సీతాదేవి బంగారు లేడిని చూచి ఆకర్షితులైనపుడు రాముడు ఆ లేడిని వేటాడుచూ వెళ్ళెను. దుష్టరావణుడు సీతను అపహరించెను. జటాయువు సీతను రక్షించుట కొరకు రావణునితో యుధ్ధము చేసి అసువులు బాసెను. రాముడు సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని సంహరించెను. సముద్రము దాటి లంకను నాశనము చేసి రావణ కుంభకర్ణాది రాక్షసులను హతమార్చి సీతను విడిపించెను. రామయణము నందలి కథ సంగ్రహముగా ఇది.
వివరణ
వివరణ
పూర్వం రామ శ్లోకము | వివరణ |
---|---|
పూర్వం | పూర్వ కాలంలో, అనగా త్రేతాయుగంలో |
రామ | శ్రీరామచంద్రుడు |
తపోవనాది | మునులు తపస్సు చేసుకునే అడవులకు |
గమనమ్ | వెళ్లెను |
హత్వా | చంపెను |
మృగం కాంచనం | బంగారు లేడిని |
వైదేహీ | సీతాదేవి |
హరణం | అపహరించబడెను |
జటాయు | సీతాదేవిని రక్షించుటకు ప్రయత్నించిన జటాయు అను పేరుగల పక్షి |
మరణం | మరణించెను |
సుగ్రీవ సంభాషణం | వానర రాజు అయిన సుగ్రీవునితో స్నేహము చేసికొనెను |
వాలీ నిర్దలనం | సుగ్రీవుని అన్న అయిన వాలి అను వానర రాజుని చంపెను |
సముద్ర | సముద్రమును |
తరణం | దాటెను |
లంకాపురీ దహనం | హనుమంతుని చేత లంకా నగరము కాల్చబడెను |
పశ్చాత్ | అ తరువాత |
రావణ కుంభకర్ణ | రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైన రాక్షసులను |
హననం | చంపెను |
ఏతద్ హి | ఇదియే |
రామాయణం | సంగ్రహముగా రామయణము నందలి కథ |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి