ప్రేమ లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం వ్యర్థం. ప్రేమతో కర్తవ్యాన్ని నిర్వహించడం ఎంతో ముఖ్యం. ప్రేమతో పనులను నిర్వర్తించటం సహజమే అయినప్పటికీ, ఆ ప్రేమను అనుభవిస్తూ నిర్వర్తిస్తే అది దివ్యత్వం గా మార్పు చెందుతుంది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించి నప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతాడు. కొన్ని విధులు మన కొరకు నిర్వర్తిస్తే, మరికొన్ని విధులు ఇతరులకై నిర్వరిస్తారు. భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా మనము అందరిలో భగవంతుని చూడటం, ప్రేమించడం వంటి దిశవైపు అడుగు వేయగలుగుతాము. శ్రీ సత్య సాయిబాబా వారు “భగవంతుని పట్ల ప్రేమను కలిగి ఉండటం ఉన్నది సేవ ద్వారానే పెంపొందుతుంది. నిస్వార్థ సేవయే గొప్ప ఆధ్యాత్మిక సాధన”.
“ప్రేమయే దైవము. దైవమే ప్రేమ”. సేవ ద్వారా నిస్వార్థ ప్రేమను వ్యక్త పరిస్తే, అది ఆరాధనగా మారుతుంది. అదే గొప్ప సాధన అంటారు భగవాన్ శ్రీసత్య సాయిబాబా. ప్రేమతో కర్తవ్యాన్నిఎలా నిర్వర్తించాలో తెలుపుటకు రెండు అద్భుతమైన కథలు వివరించబడ్డాయి.
“మానవుని సేవించుట దేవుని సేవించుటయే” అన్న కథలో అబ్రహం లింకన్ జీవితంలోని యథార్థ సంఘటనలు వివరించబడినది. ఈ కథ సేవ యొక్క నిజమైన అంతరార్థాన్ని పిల్లలు అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.
“మానవ ప్రయత్నం-దైవసహాయం” ఈ కథ ద్వారా స్వధర్మాన్ని ఆచరిస్తూ, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండటం అన్న విషయాల ప్రాముఖ్యతను తెలుపుతుంది.