ఎప్పుడైతే సత్యాన్ని ఆచరిస్తామో అప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపగలుగుతాము. సత్యం వాక్కునకు సంబంధించినది అయితే, ధర్మము ఆచరణకు సంబంధించినది. కనక వేదాలు “సత్యంవద, ధర్మంచర” అని బోధిస్తున్నాయి. సత్యాన్ని పాటించుటయే నిజమైన ధర్మము.కనుక మానవుడు తప్పనిసరిగా తమ జీవితాన్ని ధర్మానికి అంకితం గావించుకోవాలి. చిన్న వయసు నుండే ధర్మాన్ని ఆచరించటం ఒక సాధనగా ప్రారంభించాలి.ధర్మాన్ని కేవలం ఒక వ్యక్తిగా కాక సమిష్టిగా దేశం మొత్తం పురోగతి సాధించే విధంగా సాధన చేయాలి. ఎప్పుడైతే హృదయంలో ధర్మం ఉంటుందో, శీలం ఉన్నతంగా ఉంటుంది.
ఎప్పుడైతే శీలం ఉన్నతంగా ఉంటుందో ఇంట్లో సమతుల్యమైన వాతావరణం ఉంటుంది. ఇంటి వాతావరణం సమతుల్యంగా ఉంటుందో అప్పుడే దేశంలోని వ్యవస్థ క్రమబద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే దేశంలో క్రమబద్ధమైన వ్యవస్థ ఉంటుందో, అప్పుడు ప్రపంచ శాంతి నెలకొంటుంది.
గ్రూప్ I పిల్లల మనసులో ఈ మౌలిక విలువలను నాటుటకై “నిజాయితీ, మానవసేవయే మాధవసేవ, స్వయంకృషి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత” మొదలగు కథలు ఇవ్వబడినవి.