వందే దేవముమాపతిం
ఆడియో
పంక్తులు
- వందే దేవముమాపతిం సురగురుం వందే జగత్కారణం|
- వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం|
- వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం|
- వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం|
భావం:
ఉమా (పార్వతి) పతికి, దేవగురువు, సృష్టికర్త అయిన దేవదేవునికి నమస్కారము. సర్పములు ఆభరణముగా కలవాడు, మృగచర్మము ధరించిన వాడు, సకల జగత్తుకు భర్త అయిన భగవంతునికి నమస్కారము. సూర్య చంద్రులు అగ్ని నేత్రములుగా కల ముక్కంటికి, విష్ణువుకు ప్రియమైన వానికి, భక్త జనులందరికి ఆశ్రయమైన వానికి, అందరికీ వరములు ప్రదానము చేయు భగవంతునికి, మంగళ ప్రదునికి, శుభములు కలిగించు వానికి నమస్కరించుచున్నాను.
వివరణ
వివరణ
ఉమాపతిం | పార్వతీ దేవికి భర్త అయిన |
---|---|
సురగురుం | దేవతల గురువు |
జగత్కారణం | సృష్టికర్త |
పన్నగ భూషణం | సర్పము ఆభరణముగా కలవాడు |
మృగధరం | మృగ చర్మము ధరించిన వాడు |
పశూనాం పతిం | పశువులకు (జీవులందరికి) భర్త అయిన వాడు |
సూర్య | సూర్యుడు |
శశాంక | చంద్రుడు |
వహ్ని | అగ్ని |
నయనం | నేత్రములుగా కలవాడు |
ముకుంద ప్రియం | విష్ణువుకు ప్రియమైన వాడు |
భక్త జనాశ్రయం | భక్త జనులకు ఆశ్రయమైన వాడు (ఆధారమైన వాడు) |
చ | మరియు |
వరదం | వరములు ప్రసాదించు వాడు |
శివం | మంగళ ప్రదుడు |
శంకరం | శుభములు కలిగించు వానికి |
వందే | నమస్కరించుచున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి