జై జై జై మనమోహనా
ఆడియో
సాహిత్యం
- జై జై జై మనమోహనా
- జై జై జై మధుసూదనా
- మాధవా కేశవా
- కేశవా మాధవా
- గోపాలా గోపాలనా
- సాయి గోపాలా గోపాలనా || జై జై జై ||
భావము
మనసును అరికట్టగలిగినటువంటి వాడైన,’మధు’అను రాక్షసుని సంహరించినటువంటి వాడైన, అహంకారాన్ని నశింప చేయువాడైన, మహాలక్ష్మి భర్త అయినటువంటి, మాయను జయించిన వాడైనట్టి, అందముగా ముడి వేయబడిన వెంట్రుకలు కలవాడైన, గోవులను సంరక్షించే గోపాలునకు జయము జయము జయము.
వివరణ
జై | జయము |
---|---|
మనమోహన | మనసును నియంత్రించే వాడగు |
మధుసూదన | ‘మధు’ అను రాక్షసుడిని సంహరించిన వాడగు, మధు అనగా తేనె. తేనె తీయనైన అహంకారానికి ప్రతీక. మధుసూదన అనగా అహంకారాన్ని నశింప చేయువాడు అని అంతరార్థం |
మాధవ | ‘మా’…లక్ష్మి; ‘ధవ’…భర్త; మహాలక్ష్మికి భర్త అయినటువంటి మా అనగా మాయ. మాధవ అనగా మాయను జయించినవాడు అని అంతరార్థం. |
కేశవ | ‘కేశి’ అనే రాక్షసుడిని సంహరించిన వాడైనటువంటి, అందముగా ముడివేయబడినటువంటి తల వెంట్రుకలు కలవాడైన. |
గోపాల | గోవులను పాలించువాడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
కార్యాచరణ
-
మరింత చదవడానికి