బాలవికాస్ యొక్క సామూహిక కార్యక్రమాలలో చిక్కు ప్రశ్నలు మరియు పొడుపు కథలు ఒక అంతర్భాగముగా ఉపయోగించుకొనవచ్చు. చిన్నారులకు సంఘపరమైనటువంటి (సాంఘిక) నిపుణతను, కుశలతను, నైపుణ్యమును పెంపొందించుకొనుటలో వీటి ద్వారా అవకాశములు విస్తారముగా లభిస్తాయి / ఇవి ఎంతో దోహదపడతాయి. ఉదాహరణకు పరస్పర సహకారము, నాయకత్వ లక్షణములు, సంఘీభావము, పాలుపంచుకొనుట మొదలైనవి.
విద్యార్థిని విద్యార్థుల విశ్లేషణాత్మక ఆలోచన శక్తిని, సమస్యను పరిష్కరించు సామర్థ్యమును పొందించుటేకాక / అభివృద్ధి పరచుటేకాక వారి యొక్క సూక్ష్మ బుద్ధిని, తర్క యుక్తిని అభివృద్ధి పరుస్తాయి.
వినోద భరితమైనటువంటి ఈ అభ్యాసముల ద్వారా మతము, మానవతా విలువలు అనేటువంటి సూక్ష్మములు అతి సులభముగా చిన్నారుల మనస్సునకు హత్తుకునేటట్లు అవగతము అవుతాయి.
జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంపొందించుటకు మనోరంజకమైన, మెదడుకు మేత పెట్టేటువంటి చిక్కు ప్రశ్నలు ఈ విభాగములో రూపొందించబడ్డాయి.
ఈ చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు బోధనాపరమైనటువంటి అంశములే కాకుండా మూల్యాంకనములుగా కూడా ఉపయోగపడతాయి. వీటిని పరిష్కరించే సమయంలో చిన్నారులు తమ బాలవికాస్ తరగతులలో నేర్చుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి విషయములను జ్ఞప్తికి తెచ్చుకుంటారు మరియు స్మరించుకుంటారు.
గురువులు బాలవికాస్ క్లాసెస్ మరింత వినోదపరితంగా, ఉల్లాసభరితముగా బోధించుటకు వీటిని ఉపయోగించుకొనవచ్చును.