నహి జ్ఞానేన
ఆడియో
శ్లోకము
నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి
తాత్పర్యము:
ఈ లోకములో జ్ఞానముతో సమానమైనది, పవిత్రమైనది వేరే ఏదీ లేదు. కర్మలు చేయుచు, ఇంద్రియములను నిగ్రహించుకొని, యోగసిద్ధిని పొందిన సిద్ధుడైన వ్యక్తి యోగ్యత పొంది కాలక్రమంలో తనలో తానే బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. బ్రహ్మ జ్ఞానం వల్ల అన్ని కర్మలు, ఫలితములు కూడా నశించి ముక్తి పొందుతాడు.
వివరణ
న | లేదు |
---|---|
హి | నిస్సందేహంగా |
జ్ఞానేన, సదృశం | జ్ఞానంతో సమానంగా, సమానమైనది |
పవిత్రం | పవిత్రమైనది |
ఇహ | ఈ జగత్తులో |
(న)విద్యతే | ఏదీ (లేదు) |
తత్ | ఆ జ్ఞానాన్ని |
స్వయం | స్వయంగానే |
యోగసంసిద్ధః | కర్మయోగము ద్వారా సిద్ధిపొందినవాడు |
కాలేన, ఆత్మని | కాలక్రమములో, ఆత్మలో/తనలో |
విందతి | పొందుతాడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty