ప్రతి ఒక్క రూపం శక్తితో అనగా దుర్గాదేవితో నిండి ఉన్నది. వ్యక్తిలో అనంతమైన దివ్య శక్తి ఉంది. వాగ్రూపంలో సరస్వతిగా ఉన్నది. శరీరాన్ని బ్రహ్మగాను, నాలుకను సరస్వతి గాను పరిగణిస్తారు. హృదయంలోని తరంగాలు శరీరము మరియు నాలుక కలయికతో ధ్వని రూపంలో వ్యక్తం అవుతాయి. లక్ష్మీ సంపదని, శ్రేయస్సును సూచిస్తుంది. సంతోషానికి ఆనందాలకి ప్రతీక. గేదె తలతో ఉన్న రాక్షసుడు మహిషాసురుడు దుష్టశక్తులకు ప్రతినిధి.
దేవి అనగాదుర్గ, లక్ష్మీ, సరస్వతి యొక్క సమ్మిళిత శక్తి. తన సంకల్ప, క్రియ, జ్ఞాన శక్తులతో మహిషాసురుని అంతం చేసింది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలోని అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగేందుకు మనలోని సంకల్ప, క్రియ, జ్ఞాన శక్తులను మేల్కొల్పడానికి సాయి మాతను దేవి భజనలతో ప్రార్థిద్దాం.