సాయిబాబా అనే పేరు యొక్క అర్థాన్ని పరిశీలించండి. ‘స’ అంటే దివ్య, ‘ఐ/అయి’ అంటే తల్లి మరియు ‘బాబా’ అంటే తండ్రి. అటులనె సాంబ శివ అనె పేరు దివ్యమైన తల్లి మరియు తండ్రిని సూచిస్తుంది. మీ భౌతిక తల్లిదండ్రులు పంచే ప్రేమ కొంతస్వార్థంతో కూడి ఉంటుంది. కానీ, ఈ సాయి మాత మరియు సాయి పిత ప్రేమ, ఆప్యాయతలను కురిపిస్తుంది, స్వీయ- సాక్షాత్కారం కోసం సాగే పోరాటంలో మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఎందుకంటే, అన్నిటికి ఆధారమైన పరమాత్మని వెల్లడించడానికి ప్రతి జీవి ఆత్మ యొక్క వాస్తవాన్ని ధృవీకరించడం మరియు ప్రకాశింపజేయడం, సోదర బంధం ద్వారా సమస్త మానవాళిని ఒకే కుటుంబంగా ఏకం చేసే అత్యున్నత కార్యాన్ని సాధించడానికి ఈ సాయి రాగా మొత్తం సర్వ సృష్టిలోని మనుషులు అందరిలోన కలిగి ఉన్న సాధారణ దైవభక్తి పెంపొందించడానికి వచ్చెను. తద్వారా మనిషి తనలోని పశుత్వం నుండి దైవత్వం వైపు ఎదిగి తన లక్ష్యాన్ని చేరగలడు. ప్రేమే నా స్వరూపము, ప్రేమే నా సాధనం. సృష్టిలో ప్రేమ లేని జీవి లేదు; అత్యల్ప జీవి కూడా తనను తాను ప్రేమించును, మరియు తనలోని దివ్యత్వమును గుర్తించును. కాబట్టి నాస్తికులే లేరు, అయితే కొందరు భగవంతుని ఇష్టపడని లేదా తిరస్కరించే వారు ఉండవచ్చు. ఎలాగంటే మలేరియా రోగులు స్వీట్లను ఇష్టపడరు లేదా మధుమేహ రోగులు స్వీట్లతో సంబంధం కలిగి ఉండరు! తమను తాము నాస్తికులుగా భావించే వారు ఏదో ఒక రోజు, వారి నాస్తికత్వం అనే అనారోగ్యం పోయినప్పుడు, భగవంతుడిని ఆరాధిస్తారు మరియు ఆయనను గౌరవిస్తారు. ఈ సాయి గురించి సత్యం నేను మీకు చాలా చెప్పవలసి వచ్చింది, ఎందుకంటే, మీరు దీని గురించి ఆలోచించి, దాని నుండి స్ఫూర్తిని పొందాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా మీరు నేను నిర్దేశించిన క్రమశిక్షణలను పాటీస్తూ స్వీయ- సాక్షాత్కార లక్ష్యం వైపు పురోగమించేలా ప్రేరేపించబడాలని నేను కోరుకుంటున్నాను. ఆ సాక్షాత్కారమే మీ హృదయాలలో ప్రకాశించే సాయి.- బాబా
మన సాయి దేవుని కీర్తిస్తూ ‘స్వామి భజనలు’ పాడదాం.