స్వామి వివేకానంద పశ్చిమ బెంగాల్ లోని కోల్కత్తాలో జన్మించారు. అతని పేరు నరేంద్రనాథ్ దత్తా. ఇతను రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఇతను వేదాంత తత్వాన్ని ప్రోత్సహించటమే కాక పాశ్చాత్య ప్రపంచానికి హిందూమతాన్ని పరిచయం చేశాడు. వేదాంత తత్వాన్ని బోధించడం కాదు, దీన జనులను ఉద్ధరించటం, వారిని బాధల నుండి ఉపశమనం కలిగించుటం అన్నవి తక్షణమే ఆచరణత్మకంగా చేయవలసినవి అని స్వామి వివేకానంద ఎల్లప్పుడూ ఉద్భోదించేవారు.
స్వామి వివేకానంద మనస్సు తన గురువైన రామకృష్ణుల వలె ఈ బాహ్య ప్రపంచాన్ని దాటి, సంపూర్ణ మైన ధ్యానంలో తనను తాను మరిచిపోవు స్థితిని కలిగి ఉంటుంది.
ఈ క్రింది విభాగంలో ఈ మహనీయుని యొక్క జీవిత గాధలు మరియు ప్రముఖ సంఘటనలు ఉన్నాయి. స్వామి వివేకానంద మన దేశం యొక్క శక్తి యువత అంటూ ఎల్లప్పుడూ నొక్కి వక్కాణించేవారు. కనుక విద్యార్థులు అతని గురించి విపులంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.