ప్రేమ అన్ని మానవతా విలువలకు అంతర్వాహిని అయితే, అహింసను సాధన చేయుట అన్ని మానవతా విలువలకు పరాకాష్ఠ అని చెప్పవచ్చును. ఎప్పుడైతే విశ్వంలోని అన్ని చేతన, అచేతనత్వం లోని ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మన అజ్ఞానం నశించి, జ్ఞానం వికసిస్తుంది.
కోరికలను నియంత్రించు కోవడం ద్వారా అహింసను ఆచరించవచ్చు. ఆహారము, కాలము, శక్తి మొదలగు వాటిలో కోరికలను నియంత్రించ గలిగితే మానవుడికి ప్రకృతికి మధ్య సమన్వయం కలుగుతుంది.
అష్ట పుష్పాల హారంలో అహింసా ప్రథమ పుష్పమని స్వామి చాలా చక్కగా వివరించారు. ఈ విభాగం క్రింద చేర్చబడిన కథలైన, 1. మంచి నాలుక చెడు నాలుక. 2. శాంతియే తృప్తి ద్వారా అహింస లోనే నిజమైన శాంతి దాగి ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకొనవచ్చు.