విశ్వవ్యాప్తంగా అత్యధిక ఆవశ్యకత గల ప్రధానాంశము
“శాంతి”. ప్రపంచ శాంతికి దోహదం కలిగించిన స్త్రీ పురుషులకు “నోబుల్ శాంతి బహుమతులు మరియు అనేక జాతీయ అంతర్జాతీయ గుర్తింపులు” ఇవ్వడం జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు శాంతికాముకులు అందరికీ ఒక సరళమైన నివారణోపాయం సెలవిచ్చారు.” ‘నేను మరియు నాది’ (కోరిక) అనునవి తొలగించుకొన్నప్పుడే ప్రతి వ్యక్తి శాంతిని పొంద గలుగుతాడు”. ఎప్పుడైతే ఒక వ్యక్తి శాంతి స్వరూపుడు అవుతాడో, అప్పుడు సుఖదుఃఖాలకు చలించడు. అత్యాశ, అసంతృప్తులకుమ లోను కాడు. కనుక ప్రతి వ్యక్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలంటే, ఏది జరిగినా అంతా భగవంతుని అనుగ్రహంగా భావించాలి. భగవాన్ బాబా వారు ఈ విషయాన్ని ఇంకా ఇలా చెప్పారు. “గుర్రము నీది అయినప్పటికీ, స్వారీ చేస్తున్నప్పుడు కళ్ళెము వదిలిపెట్టినచో విపత్తు ఎలా కలుగుతుందో, కారు నీదే అయినా, అవసరమైనప్పుడు బ్రేకులు వేయకపోతే ఎలా ప్రమాదం జరుగుతుందో, అదేవిధంగా ఇంద్రియములను నియంత్రించక పోతే అటువంటి ప్రమాదమే కలుగుతుంది.ఇంద్రియ నిగ్రహము సాధు సత్పురుషులకే కాదు, మానవులందరికీ అత్యంత ఆవశ్యకమైన లక్షణము. కథావిభాగంలో పేర్కనబడిన మూడు కథల ద్వారా శాంతికి సంబంధించిన చాలా విషయాలు మనము నేర్చుకొనవచ్చు.