హరి (4) స్మరణకరో
ఆడియో
సాహిత్యం
- హరి హరి హరి హరి స్మరణకరో
- హరి చరణకమల ధ్యాన్ కరో
- మురళీ మాధవ సేవా కరో
- మురహర గిరిధారి భజన కరో
భావము
మురళీధరుడు, గోవర్ధన గిరిధారీ అయిన శ్రీహరి పాదపద్మములను ధ్యానిస్తూ, సేవిస్తూ, భజింపుము.
వివరణ
హరి | హరించువాడు (పాతకములను, మాయను, మనస్సులను హరించువాడు); విష్ణు మూర్తి అనంత నామములలో ఒకటి |
---|---|
స్మరణకరో | స్మరణచేయుము |
హరి చరణ కమల | శ్రీహరి యొక్క పాద పద్మములను |
ధ్యాన్ కరో | ధ్యానము చేయుము |
మురళీ | వేణువును ధరించుటచే శ్రీకృష్ణుడు మురళీ అను నామముచే పిలువ బడుతాడు (మురళీ ధర) |
మాధవ | మనసును మధించు వాడు కనుక మాధవుడు అని పిలువబడతాడు. ‘మా’ అనగా లక్ష్మి , ‘ధవ’ అనగా పతి. లక్ష్మీ దేవి భర్త. |
సేవాకరో | సేవ చేయుము |
మురహర | ‘ముర’ అను రాక్షసుని వధించుటచే మురహరుడని పిలువబడతాడు. |
గిరిధారి | శ్రీకృష్ణుడు చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరిని ఎత్తినందువలన గిరిధారి అంటారు. |
భజనకరో | భజన చేయుము. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
కార్యాచరణ
-
మరింత చదవడానికి