సత్యం నుండి వ్యక్తీకరించబడినదే ప్రేమ. ఇది ఆత్మతత్వం నుండి ఉద్భవించినది. స్వచ్ఛమైనది, స్థిరమైనది, ప్రకాశవంతమైనది,ఈ గుణము నిరాకారమైనది, అనాదిగా వుంటున్నది. ఇది శాశ్వతమైనది మరియు అమృత మయమైనది. ఇవి ప్రేమ యొక్క తొమ్మిది గుణాలు. ప్రేమ ఎవరినీ ద్వేషించదు. అన్నింటినీ ఏకం చేస్తుంది. ఏకాత్మ దర్శనం ప్రేమ (ద్వంద్వత్వం లేని అనుభవమే ప్రేమ).
మన ఆలోచనలు ప్రేమమయమైతే మన హృదయాల్లో సత్యం వ్యక్తమవుతుంది, ప్రేమ చేతల్లో కలిస్తే, మనం చేసే చర్యలన్నీ ధర్మాన్ని ఆచరిస్తాయి. ప్రేమ మన భావంలో కలిస్తే, శాంతిని పొందగలుగుతాము. మరియు, ప్రేమ మన అవగాహనలో కలిసి, సర్వవ్యాప్త ప్రకృతిలోని ప్రేమను అనుభవించి నప్పుడు, అహింస అనే కవచము మనల్ని ఆవరించి , మనం చేసే ప్రయత్నాలన్నీ అహింసతో కూడుకొని ఉంటాయి.
అందువలన, ప్రేమ అనేది అన్ని విలువల యొక్క అంతర్వాహినిగా వుంటూ, వాటికి దైవిక గుణాన్ని కల్గిస్తుంది. భగవంతుని పట్ల ప్రేమయే భక్తి. ఈ విభాగంలో, ప్రేమ మరియు భక్తికి సంబంధించిన కథలు జాబితా చేయబడ్డాయి.










![అష్టోత్రం [55-108]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)











