అహింస మిగిలిన నాలుగు విలువలయిన సత్య, ధర్మ, శాంతి, ప్రేమల అంతర్వాహినిగా ప్రకాశిస్తుంది. సర్వ జీవుల పై చూపీంచు గౌరవము, ప్రేమ యొక్క నైతిక సూత్రమే అహింస. మానవులు, జంతువులు, మొక్కలు, సరస్సులు, పర్వతాలు మరియు హిమానీనదాలు అన్నీ పరమాత్మ యొక్క విడదీయరాని భాగాలుగా చూడటాన్ని ‘అవగాహన’ అంటారు.
ప్రేమ + అవగాహన = అహింస.
వీధిలో మనల్ని ఢీకొన్న అంధుడిని నిందించము ఎందుకనగా ‘అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. అదేవిధంగా, వాస్తవికతకు తెలుసుకోలేని అంధులైన వారు మనచే క్షమించబడాలి: ఈ వైఖరిని కల్గియుండటం ద్వారా మనం హింసాత్మకంగా ప్రతిస్పందించాలనే కోరికకు లొంగకుండా ఇతరుల నుండి కలిగే అవమానాల ద్వారా ఏర్పడిన గాయాన్ని సహించగల్గుతాము. సమస్త సృష్టి యొక్క ఏకత్వం గురించి అవగాహన లేనిచో, మనం ఇతరుల లోని లోపాలను క్షమించలేము.మర్చిపోలేము. ఇక్కడ జాబితా చేయబడిన కథలు అహింస యందలి సామాజిక బాధ్యతాభావాన్ని తెలియజేస్తాయి.


















![అష్టోత్రం [55-108]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)


