శత్రౌ మిత్రే పుత్రే బంధౌ

AUDIO
సాహిత్యం
- శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
- మా కురు యత్నం విగ్రహ సంధౌ |
- సర్వస్మిన్నపి పశ్యాత్మానం
- సర్వత్రోత్సృజ భేదాఙ్ఞానం ||
భావము :
శత్రువని, మిత్రుడని, పుత్రుడని, బంధువని ఉపేక్షలు, ఆపేక్షలు అనే ద్వంద్వములు సాధకులకు తగవు. “ఈశ్వర సర్వభూతానాం” అనే సత్యాన్ని గుర్తించి భేద భావాన్ని త్యజించాలి. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. భేద భావానికి అజ్ఞానము, మోహము కారణములు. ఈ భ్రాంతి వదిలితే సమ దర్శనం అలవడుతుంది. సమ దర్శనమే జ్ఞానానికి లక్ష్యం. “ఆత్మవత్ సర్వభూతాని” అని అన్నింటిలోనూ పరమాత్మను గుర్తించిన వాడే జ్ఞాని. సమదృష్టి కలవాడే నిజమైన పండితుడు.

Explanation
| శత్రౌ | శత్రువుయందు |
|---|---|
| మిత్రే | మిత్రునియందు |
| పుత్రే | కుమారుని |
| బంధౌ | బంధువు యందు |
| మా | వద్ద |
| కురు | చేయుట |
| యత్నం | ప్రయత్నము |
| సంధౌ | స్నేహము |
| సర్వస్మిన్ అపి | ప్రతి వస్తువునందు |
| పశ్య | చూడుము |
| ఆత్మానం | సద్వస్తువును |
| సర్వత్ర | అన్నిచోట్ల |
| ఉత్సృజ | లేవగొట్టుము |
| భేద అజ్ఞానం | భేద మనే అజ్ఞానము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty



















