మన ఆలోచనలు లెక్కలేనన్ని నీటి బిందువుల లాంటివి, అవి మాటలు మరియు చేతల నదిని ఏర్పరుస్తాయి. ఈ నదిపై మాకు నియంత్రణ తక్కువ. ఇది చాలా బలంగా ఉంది, దాని మార్గంలో ఉన్న భారీ బండరాళ్లను కూడా కొట్టుకు వెళ్ళిపోతుంది. ఏది ఏమైనప్పటికీ, కేవలం ఒక రాయితో, అనగా “నిశ్శబ్దంలో ఉండటం” అనే మాయాజాలంతో నది ప్రవాహ దిశను దాని మూలం నుండి నిరోధించడం లేదా మార్చడం సులభం. బాబా ఏమని చెప్పారు అంటే- “హృదయము యొక్క చంచలతను నిశ్చల పరచడానికి నిశ్శబ్దం వంటిది మరొకటి లేదు”.
నిశ్శబ్దాన్ని అనుభవించే వివిధ పద్ధతులలో, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు “గైడెడ్ విజువలైజేషన్” చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పిల్లలు ఊహించుకోవడానికి మరియు వారిని గైడెడ్ సెషన్ ద్వారా తీసుకువెళ్లడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సెషన్ ప్రకృతి నుండి ఏదైనా వస్తువుపై ఉంటుంది.పిల్లలు సులభంగా విజువలైజ్ (దృశ్యమానం) చేయడానికి సహాయపడటానికి వస్తువు యొక్క లక్షణాలు స్పష్టమైన రీతిలో వివరించబడతాయి.