ధ్యానము -మార్గదర్శకాలు
భగవంతుని యొక్క అంతరంగ మహిమను తెలుసుకోవాలంటే, ఎవరైనా మొదట తన అంతరంగంమ లోనికి తాను ప్రవేశించాలి. ఎందుకంటే తన అంతరంగాన్ని ఎరుగనివాడు భగవంతుని తెలుసుకోలేడు.
మొదట సౌకర్యవంతమైన మరియు స్థిరమైన భంగిమలో కూర్చొని, తర్వాత శ్వాసను స్థిరపరచి, ప్రత్యా హారము(అనగా ఇంద్రియములకు ఆహారము, ఇంద్రియ వస్తువుల నుండి ఇంద్రియాలను దూరం చేయటం) మరియు అంగన్యాసం (శరీరంలోని అన్ని అవయవాలను శుద్ధి చేయటం) చేయాలి. కాంతి అన్నిటినీ శుద్ధి చేయగలదు. ఇది అంతటా వ్యాపించి ఉన్న చీకటిని తొలగిస్తుంది. కాంతిని శరీరమంతా వ్యాపింప జేసినచో, అది అన్ని అవయవాలను మరియు ఇంద్రియాలు శుద్ధి చేస్తూ, హృదయ కమలంలో ప్రతిష్టించబడుతుంది. ఇందులో ధారణ కొరకై భగవంతుని స్వరూపం యొక్క భావ చిత్రాన్ని (మానసిక ఆలోచనా చిత్రం) ప్రతిష్టించాలి. దీని ద్వారా ఏకాగ్రత కలిగి ధ్యానము, తద్వారా సమాధికి (అతీంద్రియ ఆనంద స్థితికి) దారి తీస్తుంది.
మొదట, మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు , దేవుని మహిమను తెలియజేసే శ్లోకాలను పఠించండి. తద్వారా మనసులో ఆందోళన తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది. ఆ తర్వాత క్రమంగా జపం చేస్తున్నప్పుడు, ఈ నామాన్ని జపిస్తున్నామో, ఆ నామము యొక్క రూపాన్ని మనసులో చిత్రీకరించండి. మీ మనసు మీ జపం నుండి మరలినప్పుడు, దాని తిరిగి ఆ రూపం పైకి తీసుకుని రండి. ఆ రూపంపై మళ్లించిన తర్వాత మనసును మళ్ళీ ఆ నామం పైకి తీసుకుని వెళ్లండి. తర్వాత ఆ నామం యొక్క మాధుర్యత మీద కానీ లేదా రూపం మీద కానీ మనసును స్థిరపరచండి. ఇలా మనస్సుకు శిక్షణ ఇస్తే, దానిని అదుపు చేసుకోవచ్చు. మీరు చిత్రీకరించిన భగవంతుని ఊహాత్మక చిత్రం, మీ భావ చిత్రముగా అనగా ఆలోచన చిత్రంగా రూపొందుతుంది. ఇది మీ హృదయానికి ఎంతో ప్రీతికరమైనదిగా ఉండి, మీకు ఎప్పటికీ స్థిరంగా గుర్తు ఉండిపోతుంది. మీరు చిత్రీకరించిన రూపాన్ని భగవంతుడు స్వీకరించి, ఆ రూపంలో మీకు సాక్షాత్కరించి మీ కోరికను నెరవేరుస్తాడు. ఈసాధనను జప సహిత ధ్యానము అంటారు. మొట్టమొదటిగా జప సహిత ధ్యానము ప్రారంభించటం ఉత్తమమైనది అని నేను అందరికీ సూచిస్తున్నాను.
దేహము భగవంతుడు నెలకొన్న దేవాలయము
కొద్ది రోజులు ఈ ధ్యాన సాధన చేసిన తర్వాత మీరు ఈ మార్గంలో ఏకాగ్రతను పొంది, అందులో కల ఆనందాన్ని రుచి చూస్తారు. ప్రారంభంలో ఈ ధ్యానం పది లేదా పదిహేను నిమిషాల చేసి లేదా మరికొంత సమయం చేసి ఆ తర్వాత ధ్యాన సమయంలో మీరు పొందిన శాంతి సౌఖ్యముల గురించి మననం చేసుకోండి.
మానవ శరీరం అనేక జన్మల పుణ్యఫలము. ఈ జన్మ సంసార సాగరాన్ని దాటడానికి మనకు సహాయపడే విలువైన పడవగా పరిగణించబడుతున్నది. కనుక దానికి కృతజ్ఞతతో కూడిన గౌరవాన్ని ఇవ్వాలి. భగవద్గీతలో శరీరము క్షేత్రంగా చెప్పబడినది. ఈ క్షేత్రంలో ఒకరు పవిత్రత అనే విత్తనాన్ని, మరొకరు పాపము అనే విత్తనాన్ని నాటవచ్చు. దానికి అనుకూలంగానే పంటను పొందవచ్చు. మీరు విత్తనాన్ని నాటే ముందు మీకు ఎటువంటి పంట కావాలో ఎంచుకోండి. క్షేత్రం అనగా భూమి అని కూడా అర్థం. పవిత్రమైన స్థలము అని కూడా మరొక అర్థం. కాశీ క్షేత్రము, ప్రయాగ క్షేత్రము మొదలైనవి పవిత్రమైన క్షేత్రాలుగా మనము చెప్తుంటాము. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనుల ద్వారా భగవంతున్ని ప్రతిష్టించి పూజించే దేవాలయం ఈ శరీరం. కనుక ఇది కూడా క్షేత్రమే. ఈ ఆలయాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచాలి.
ఇంద్రియములు దాని ఉపయోగ పరిమితులు
కేవలం స్నానం చేసినంత మాత్రాన కానీ, ఇతరులను ముట్టుకోకుండా దూరాన్ని పాటించడం ద్వారా కానీ స్వచ్ఛత చేకూరదు.
ఎవరిని ముట్టుకోకుండా దూరాన్ని పాటించడం ద్వారా స్వచ్చంగా ఉండలేరు. నీటితో కడిగితే శరీరం ఎలా శుభ్రంగా ఉంటుందో, సత్యాన్ని పలకడం ద్వారా కూడా మాట స్వచ్చంగా ఉంటుంది. తపస్సు ద్వారా జీవితం పవిత్రమవుతుంది. జ్ఞానం ద్వారా బుద్ధి లోని మాలిన్యం తొలగించబడుతుంది. అన్నిటికంటే ముందుగా మీరు శరీరం కాదు. శరీరం యొక్క నివాసి మాత్రమే అన్నదృఢవిశ్వాసం పెంచుకోవాలి. మీరు నశించే ఈ శరీరాన్ని మీరే అని భావిస్తే, మీరు పొందాలనుకున్న శాంతి ఆనందాలకు బదులుగా దుఃఖాన్ని మరియు బాధలను ఆహ్వానిస్తున్నారు అని గుర్తుంచుకోండి.
ఇంద్రియముల గురించి
ఇంద్రియములను ‘మాత్రలు’ అని పిలుస్తారు. అనగా ‘పరిమితి’ అని అర్థం. ప్రతి ఇంద్రియానికి ఒక నిర్దిష్ట అనుభవాన్ని గుర్తించే సామర్థ్యం ఉంటుంది. పప్పు రుచిగా ఉండటానికి కొంచెం ఉప్పు వేసినప్పుడు నాలుక దానిని రుచి చూస్తుంది. ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా లేదా సరిగ్గా ఉందా అని తీర్పునిస్తుంది. ఈ ముఖం అందంగా ఉంది కానీ ముక్కు ఆకృతి కొద్దిగా భిన్నంగా ఉంది అని కన్ను తెలుసుకుంటుంది. ఈ పాట మధురంగా ఉంది కానీ వినసొంపుగా లేదని చెవులు తీర్మానిస్తాయి. ’మాత్ర’ అంటే ‘పరిమితి’అని అర్థం. ప్రతి ఇంద్రియ అవయవాన్ని దానిలో అంతర్లీనంగా ఉన్న పరిమితిని ఎరుక కలిగి ఉండాలి. పరిమితికి మించి ఉపయోగిస్తే అది దుర్వినియోగం అవుతుంది. ఇది భగవంతుడు ఇచ్చిన ఉపకరణం. ఉదాహరణకు ముక్కు శ్వాసను తీసుకోవడంలోనూ మరియు సువాసనను ఆస్వాదించడంలోనూ ఉపయోగించాలి. కానీ అనేకులు దానిని దుర్వినియోగ పరచుచున్నారు. నాలుకను రాజసిక, తామసిక ఆహారాన్ని స్వీకరించడానికి మరియు మానవత్వాన్ని దిగజార్చే మత్తు పదార్థాలను స్వీకరించడానికి ఉపయోగిస్తూ కలుషిత పరుస్తున్నారు. అన్ని ఇంద్రియాలు మనిషిచే అక్రమమైన, అనధికారమైన, చట్ట విరుద్ధమైన పనుల ద్వారా దారి తప్పుతున్నాయి. తద్వారా మానసిక అశాంతి మరియు శారీరిక వ్యాధులు కలుగుతున్నాయి. శరీరము జడ పదార్థం. లోపల ఉన్న ఇంద్రియాల ప్రభావం ద్వారా అది బలహీనపడుతుంది. బాహ్య ప్రభావాలకు కూడా ఈ జడ పదార్థం మార్పు చెందుతుంది.
గురువులు రోజుకు ఒక్కసారైనా ధ్యానం చేయాలి. “మననం మనః”
మనసు అనేది మననం చేసేది. స్మరించుకునేది మరియు రుజువు చేసేది. మనస్సు మానసిక కార్యకలాపాలను రూపొందించడము, రద్దు చేయడము చేస్తుంది. అనగా సంకల్పము లేదా వికల్పము చేస్తుంది.
మనసుకు నిర్మాణము మరియు ప్రక్రియ, దృఢత్వము మరియు నిరాకరణ, చేయవలసినవి మరియు చేయకూడనివి, సంకల్పము మరియు వికల్పాలు ఉన్నాయి. ఇవి తప్ప దానికి ప్రత్యేకమైన ఉనికి లేదు. నిద్ర తన కార్యకలాపాలను నిలిపి వేసే వరకు మనసు ఎప్పుడూ వాటిలో నిమగ్నమై ఉంటుంది. కొన్నిసార్లు నిర్ణయం లేదా సంకల్పం చాలా బలంగా మారినప్పుడు మనసు దాని పరిమితులను అధిగమించి మనిషిని పిచ్చివాడిగా మారుస్తుంది.
మనసును ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంచడానికి ధ్యానం సాధనగా సూచించబడినది. ధ్యానము అన్నది మనసు యొక్క సానుకూల మరియు ప్రతికూల అంశాలను ఉనికిలో లేకుండా నియంత్రించేది. నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్నప్పుడు మనిషి అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడు. మనిషి తాను కలలు కన లేని గాఢమైన నిద్రలో కోరికలు లేదా తిరస్కరణ అతనికి ఏమాత్రం భంగం కలిగించనప్పుడు ఆనందం అతనికి కలుగుతుంది. మనం ధ్యానం ద్వారా నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్నప్పుడు ఆనందంతో సంతృప్తి కలుగుతుంది. అప్పుడు మనలో కలిగే ఆనందము భావాతీతమైనది, త్రిగుణ రహితమైనది. అనగా మన ఊహలకందనిది మరియు గుణ రహితమైనదిగా వర్ణించబడినది.
నీవు నీ జీవితాన్ని గురువుగా అంకితం చేసుకుని తద్వారా పిల్లల జీవితంలో జ్ఞానమనే వెలుగును నింపండి. ఈ ఆనందాన్ని మరియు సమస్థితిని పొందుటకు కనీసం కొంతసేపు ఈ ధ్యాన క్రమశిక్షణను ఆచరించినచో మీరు పిల్లలలో ఈ ఆనందాన్ని నింపుటకు అర్హత పొందుతారు. మీరు ఆనందాన్ని పొందినప్పుడే ఇతరులకు ఆనందాన్ని అందివ్వగలరు. ఒక యాచకుడు మరొక యాచకుడిని ఎలా మార్చగలడు? ఒక బిక్షగాడు మరొక బిక్షగాడిని ధనవంతుడిని చేయలేడు. ఆనందం కలిగిన వ్యక్తి తన చుట్టూ ఉన్న వారితో ఆనందాన్ని పంచుకొనగలడు కాబట్టి గురువులుగా మీ కర్తవ్యం ఆనందాన్ని పొందటం మరియు ఆనందాన్ని అందించటం. ప్రతి గురువు జీవితంలో సాధన తప్పనిసరిగా చేయాలి.
గురువు పాత్ర అనునది భగవంతుడు ఇచ్చిన వరము
గురువుల చేయవలసిన సా పూలమాలగా ధనలు మూడు రకములు. వ్యక్తిగత సాధన, సామాజిక సాధన మరియు సార్వత్రిక సాధన. ఒక్క పువ్వు కాలేదు. ఒక్క చెట్టు అడవిగా మార్పు చెందదు. ఒక్క వ్యక్తి తో సమాజం ఏర్పడదు. ఒక వ్యక్తి యొక్క పరోపకార స్వభావము మరియు సద్గుణాలే అతని ఆధ్యాత్మిక విజయానికి కారణము. ఇతర వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు అది సమాజ సంపదగాను, ఉమ్మడి ఆస్తి గాను మారుతాయి. ప్రతి ఒక్కరూ అందరినీ గౌరవించాలి మరియు సేవించాలి. అందరిలో ఉండే పరమాత్మ అనంతమైన దివ్యాత్మలో కలిసిపోతుంది.
గురువు తన హృదయంలో అహంకారానికి చోటు ఇవ్వకూడదు. అమాయకమైన, అజ్ఞానం లో వున్న పిల్లలకు జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా ఉండాలి కానీ, గురువుగా అధికారం చూపకూడదు. గర్వంతో స్వాధీనం చేసుకున్న సింహాసనమే అహంకారము. పిల్లల ముందు వినయంగా ఉండండి. మరియు మీ స్వరాన్ని అధికారయుతంగా ఉంటే, దానిని తగ్గించుకోండి. ఇది మీకు సాధన. భగవంతుడు అనుగ్రహించిన గురువు పాత్రను గౌరవించండి. మీ దృక్పథం మాత్రమే వ్యక్తికి, సమాజానికి మరియు ప్రపంచానికి విజయాన్ని చేకూరుస్తుంది.
బుద్ధి అప్రమత్తంగా లేనియెడల విపత్తులు సంభవిస్తాయి.
శరీరము, ఇంద్రియాలు మరియు మనస్సు యొక్క క్షణికావేశము మరియు పరస్పర సంబంధాలను గురించి తెలుసుకోండి. బుద్ధి అనగా ఏమిటి ? ఇది మనసు యొక్క నిర్ణయాత్మక శక్తికి మూలము . దీనినే అంతఃకరణ అని పిలుస్తారు. ఇది ఆందోళనను, సంఘర్షణను తగ్గిస్తుంది మరియు సందేహాన్ని నిర్ధారిస్తుంది. అంతర్గత స్వరము, మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో, అదే బుద్ధి అని చెప్పబడుతుంది ఈ బుద్ధిని అంతరాత్మ అని కూడా అంటారు. మన ఉనికి యొక్క అత్యల్ప స్థాయిలో శరీరము మరియు భౌతిక కోశము ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఇంద్రియ సముదాయం ఉంది. ఐదు జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు ఐదు మరియు మనస్సు ఉన్నత స్థాయిలో ఉండగా బుద్ధి అంతకన్నా ఉన్నత స్థితిలో ఉంటుంది. తద్వారా అది ఆత్మకు దగ్గరగా ఉంటుంది. కారు యజమాని ఒక డ్రైవర్ను ఎంపిక చేసుకునేటప్పుడు డ్రైవింగ్ లో నిష్ణాతుడై వుండి, గుణవంతుడైన , యజమానికి విధేయుడుగాను ఉండు వ్యక్తినే ఎంపిక చేస్తాడు. అతడు వ్యక్తిత్వం మంచిగాను మరియు అన్ని విధములుగా ఉపయోగపడే ఉద్యోగి అయి ఉండాలి. భౌతికమైన కారు నడిపే వ్యక్తికే ఇంతటి నైపుణ్యము, సద్గుణము ఆశించినప్పుడు ఆత్మను నడిపే బుద్ధి ఇంక ఎలా ఉండాలి? అనగా ఆత్మ పరిజ్ఞానము లేకుండా దానిని స్వారీ చేయుటకు అనుమతి ఇచ్చే హక్కు బుద్ధికి లేదు.
మనస్సు కోరే అన్ని కోరికలు బుద్ధి యొక్క పరిశీలనకు లోబడి ఉండాలి. ఆత్మ యొక్క తేజస్సు ద్వారా బుద్ధి వెలిగినప్పుడే అది మనసు ద్వారా ఇంద్రియములకు చర్యలను సూచించగలదు. బుద్ధి అప్రమత్తంగా లేకుండా, మనస్సు ద్వారా మాత్రమే చర్యలు సూచించబడినప్పడు విపత్తులు సంభవిస్తాయి. బుద్ధితో అనుకూలతలను మరియు నష్టాలను క్రమబద్ధీకరించటానికి అవసరమైన సమయాన్ని వెచ్చించనివ్వండి. తొందరపాటు వ్యర్థం కలగజేస్తుంది. వ్యర్థం ఆందోళనను కలిగిస్తుంది కనుక తొందరపడకండి.
తొందరపాటు ఆందోళన మరియు తప్పిదాలకు దారితీస్తుంది. ఇది నిరాశ మరియు కోపాన్ని కలిగిస్తుంది. మనసులో ప్రశాంతతను సమత్వాన్ని కలిగి ఉండి, కోపాన్ని అధిగమించాలి.
పవిత్రమైన శాంతి మంత్రము “శాంతిః! శాంతిః! శాంతిః!” కోపతరంగాలను అధిగమించి తనకు శాంతిని కలుగ చేస్తుంది.
ఒకరి ఉత్తమమైన పని చేయకపోవడం తనకు తానుగా రాజద్రోహం చేసుకున్నట్లు.
నేను “శరీరం , ఇంద్రియం, మనసు లేదా బుద్ధి కాదు” అని ప్రకటించినప్పుడు మనిషికి భయం ఉండదు. అసలు లేని దానితో బంధం తొలగించుకోవడానికి మనిషి అడవులకు వెళ్లిన ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకునే వరకు సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. సందేహం ప్రధాన ద్వారం గుండా ప్రవేశించినప్పుడు విశ్వాసం వెనక ద్వారం ద్వారా వెడలిపోతుంది. మనిషికి గుండెపోటు వంటి సందేహం వచ్చినప్పుడు అది అకస్మాత్తుగా మనిషిని ముంచెత్తుతుంది.
భగవద్గీత “సంశయాత్మ వినస్యతి” సందేహం కలవాడు నాశనం చెందుతాడు అని చెబుతుంది. కనుక గురువును పూర్తి విశ్వసించాలి. బాలవికాస్ ఉద్యమం యొక్క ఆదర్శాలు అత్యున్నతమైనవి. వాటిని నెరవేర్చే కార్యము పరమ పవిత్రమైనది. ఇది తెలిసి కూడా, ఇంతటి ఉత్తమమైన ఉద్యమంలో పని చేయకపోవడం నిజంగా తమకు తాము ద్రోహం చేసుకోవటమే. కేవలం మాటలు పిల్లలలో మార్పు తేలేవు. మనిషి తనకు వందల మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుని గురించి ఆందోళన చెందుతాడే కానీ తన ఇరుగుపొరుగు వారి గురించి పట్టించుకోడు. పిల్లలకు అద్భుతమైన ఆలోచనలు బోధించ నవసరంలేదు. గొప్ప ఆలోచనలకై ప్రేరేపించ వలసిన అవసరం లేదు. చిన్న చిన్న ఉదాహరణాలు, ఆచరణాత్మక ఆలోచనలు, సాధారణ ప్రవర్తనా విధానములను నేర్పండి.
గురువులకు గురువు మాత్రమే బాల వికాస్ గురువులను నిర్దేశించగలరు. అంటే విద్యా విధాన ప్రక్రియలను, సమస్యలను, ప్రాముఖ్యతలను మరియు రహస్యాలను ప్రావీణ్యం పొందిన వ్యక్తి మాత్రమే అలా దర్శకత్వం వహించగలడు. అట్టివాడే బాలవికాస్ గురువులను సరిదిద్ద గలడు మరియు వారిని ఒప్పించగలడు. రాష్ట్ర అధ్యక్షులందరికీ ఈ సామర్థ్యాలు లేకపోవచ్చు. అయినప్పటికీ సంస్థలోని వేరే అంశాలలో వారు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. వారు ఇతర సేవా కార్యక్రమాలలో అనుభవం కలిగి ఉండవచ్చు. కనుక రాష్ట్ర అధ్యక్షుడికి బాలవికాస్ తో ఎటువంటి సంబంధం ఉండకూడదు అనేది నా సూచన. అతను భజన మండలి, సేవా సమితి, సేవాదళము మరియు ఇతర సేవ విభాగాలను పర్యవేక్షించాలి, నిర్వహించాలి, మరియు మార్గదర్శకత్వం వహించాలి. బాల వికాస్ గురువులు సంస్థ ద్వారా మరింత ప్రయోజనం పొందుతారు.
గురువులు అసూయ చెందరాదు
బాలవికాస్ కు బాధ్యత వహిస్తున్న మహిళలు చాలా త్వరగా ఉద్వేగము, నిస్పృహలను చెందుతారు. కనుక వారు తమ సమస్యలను వెంటనే రాష్ట్ర అధ్యక్షుల వారి వద్దకు తీసుకువెళ్లాలి అనుకుంటారు. కానీ అలా తీసుకుని వెళ్లకూడదు. ఎందుకనగా వారు రాష్ట్ర అధికార్లకు తెలియజేసి సమయంలో వారి భావోద్వేగము చల్లారిపోతుంది కనుక.
వారు కేంద్రం నుండి వెలువడిన ఆదేశాలను ఇష్టపూర్వకంగా అనుసరిస్తారు. కనుక ఇకపై వారు సలహా కోసం కానీ, మార్గ నిర్దేశకం కొరకు కానీ, పరిష్కారం కొరకు కానీ, “కన్వీనర్, బాలవికాస్ గురువు, ప్రశాంతి నిలయం” అను అడ్రస్ కి లేఖ వ్రాసి ఒక కాపీని వరల్డ్ కౌన్సిల్ సెక్రటరీ కి పంపాలి. ఈ ఉత్తరాలన్నింటినీ నేనే పరిశీలిస్తాను. .. బాబా
బాలవికాస్ గురువులు అసూయతో కానీ లేదా తప్పులు వెతకడంలో కానీ మునిగిపోకూడదు. అలాంటి లక్షణాలను వదిలించుకున్న తర్వాత మాత్రమే వారు బోధించే పనిని చేపట్టగలరు. గురువులు ఇతర గురువుల గురించి చెడుగా మాట్లాడి, అపార్థాలు, కక్షలు పెంచుకుంటే పిల్లలు ఎప్పటికీ బాగుపడలేరు. కనుక గురువును సరియైన మార్గమునకు కట్టుబడి ఉండేందుకు వెంటనే సంకల్పించండి. ఇద్దరు గురువులు కలహించుకున్నా, వెంటనే వారు ఇద్దరూ విచారణ అవసరం లేకుండా తొలగించబడతారు. ఒక విషపురుగు మొత్తం పంటను నాశనం చేస్తుంది. ఇన్ని రోజులు కఠినమైన క్రమశిక్షణ ఉండకపోవడంతో గురువులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ బాలవికాస్ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని మేము గుర్తించాము.
పిల్లలకు అన్ని మతాల పై సమానత్వాన్ని నేర్పండి
ప్రతి గురువు ఒక సంవత్సరంలో కనీసం వందమంది విద్యార్థులకు సేవ చేయాలి. అప్పుడే మనం కనీసం లక్ష లేదా అంతకంటే ఎక్కువ బాలవికాస్ విద్యార్థులకు సేవలను అందించగలరు. మన దేశంలో 10 సంవత్సరముల లోపు బాల బాలికలు 9 కోట్ల 26,000 మంది ఉన్నారు. అలాగే 16 సంవత్సరాల లోపు వారు 22 కోట్ల ఆరు లక్షల మంది ఉన్నారు. బాలవికాస్ పిల్లలకు శిక్షణ ఇస్తున్న రేటును కోట్లకు ఎప్పుడు చేరుస్తాము? ప్రస్తుతం తాబేలు వేగాన్ని కలిగి ఉన్నాము. దీనివలన ప్రయోజనం లేదు. యువత యొక్క ఆకాంక్షలు మరియు ఆశయాలు ఎంతో గొప్ప వేగంతో ఉన్నాయి. మీరు వాటిని సమాన వేగంగా మలుచుకోవాలి. అప్పుడు సమతుల్యత సరిగ్గా ఉంటుంది. వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు నీరు భూమి లోపలికి ప్రవేశించి భూగర్భంలో నిలువ చేయబడుతుంది. కానీ మనిషి భూగర్భ జలాలను భూమి క్రింద నుండి సేకరించిన దానికంటే వేగంగాను, ఎక్కువ పరిమాణంలోనూ పంపు చేయిస్తాడు. అందువలననే కరువు ఏర్పడుతున్నది కాబట్టి ఆ విధంగా కాకుండా వేగంగా వెళ్లినప్పటికీ నిలకడగా ఉంటూ, మీరు చేసే పని గురించి పూర్తిగా ఎరుక కలిగి ఉండండి.
మరొక విషయం: మీరు అన్ని మత విశ్వాసాలను సమానత్వంతో బోధించాలి. బైబిల్ నుండి ఉల్లేఖనాలు, క్రైస్తవ మతం యొక్క ఆదర్శాల ద్వారా వారికి బోధించండి. కనుక జోరాష్ట్రియనిజం, బౌద్ధమతం, ఇస్లాం మొదలైన వాటి యొక్క పవిత్ర గ్రంధాలను, ఆ మతాల ఉన్నత ఆదర్శాలను వారికి పరిచయం చేయడానికి ఉపయోగించండి. అన్ని మత గ్రంథాలలోని కథలను వారికి చెప్పండి. ఏ ఒక్క మతాన్ని కించ పరచవద్దు లేదా మరొక మతానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. పిల్లలకు భగవద్గీత మొత్తం తప్పక నేర్పించాలని సూచించారు. కానీ అది తప్పు. వారు స్వతహాగా ఉత్సాహంతో అలా చేయాలనుకుంటే, వారి మార్గంలో నిలబడకండి. కానీ మనం చేయాల్సింది ఏమిటంటే, మధురమైన, సరళమైన శైలిలో అన్ని మతాల బోధనలను చెప్పటం. సాయి మతం అనేది ప్రేమతో కూడిన అన్ని మతాల సామరస్య సమ్మేళనం. కొందరు ఇతర మతాల అనుచరులు సాయి మతం తమ మాతానికి విరుద్ధమని భావించినప్పటికీ కూడా, మనం అలాంటి భావాలను కలిగి ఉండకూడదు. మనది మొత్తం సూర్యుని కుటుంబం. అలాగే మన దృష్టిని పరిమితం చేయకూడదు.
సత్యమార్గం లో పిల్లల్ని నడిపించండి
పిల్లల సంతోషకరమైన ముఖాలను చూడడం ద్వారా మీరు అనుభవించిన ఆనందం నుండి చిరునవ్వుల వర్షం కురువనివ్వండి. కోపము, అసూయ, గర్వము వంటి హ ఉచ్చులలో పడకండి. మీరు చేపట్టిన పనుల పైననే స్థిరమైన హృదయపూర్వకమైన శ్రద్ధను కలిగి ఉండండి. మీరు చేసే సేవ పిల్లలు తమ మాతృభూమి యొక్క ప్రాచీన వైభవాన్ని పునరు జ్జీవింప చేయడం. ఈ పనిలో మీరు హీరోగా మారండి.
All India Bala Vikaas Gurus Conference, 21-11-1979
మంచి పనులన్నీ కష్టపడి చేయాలి. ఎప్పుడు సౌలభ్యం మరియు ఔన్నత్యం కలిసి వెళ్లలేవు. —-శ్రీ సత్య సాయి బాబా