“మీరు నామమును ఉఛ్ఛరిస్తున్నపుడు, జపం చేసినప్పుడు, భగవంతుని రూపం యొక్క మాధుర్యం మరియు దానితో సంబంధం ఉన్న జ్ఞాపకాలు మీకు గుర్తుకు రావాలెను. మీరు కొన్ని తీపి వంటలను గుర్తుంచుకున్నప్పుడు మీ నోటిలో నీరు వచ్చినట్లే, మీరు దైవాన్ని ఆలోచించినప్పుడు మీ మనస్సు ఆనందాన్ని ఆస్వాదించాలి. మీ హృదయాన్ని ఆకర్షించే పేరును ఎంచుకోండి. ఐశ్వర్యం అందించే ఆనందాన్ని, సంతృప్తిని అంటే నూరుపాళ్లూ అధికంగా నామంతోనే పొందగలిగినప్పుడు ఐశ్వర్యం వెంట ఎందుకు పరుగెత్తాలి? ఎక్కడ తన పేరు కీర్తించబడుతుందో “తత్ర తిష్ఠామి” అని అక్కడ నేను కూర్చుంటాను అని ప్రభువు చెప్పాడు; దైవము అక్కడ తనను తాను ఆ ప్రదేశమున ప్రకటింపబడి, అచ్చట స్థిర నివాసము ఏర్పరచుకుంటాడు. కాబట్టి, నాలుకపై భగవాన్ నామము నిర్మలమైన మనస్సుతో భగవంతుని పొందవచ్చును.- బాబా
మనమందరం ఈ నారాయణ భజనల ద్వారా అత్యంత విశ్వాసంతో మరియు ప్రేమతో దైవాన్ని ఆరాధిద్దాం.