శివుని మూడవ కన్ను జ్ఞానం, విశ్వ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆయనను పొందడానికి గల మూడు మార్గాలు కర్మ, భక్తి మరియు జ్ఞానాన్ని ఆయననే అనుగ్రహించగలడు. ఆయన భూత, భవిష్యత్, వర్తమానంకు గురువు అని ఆయన మూడు కళ్ళు సూచిస్తాయి. నిజానికి ఆయనే కాలాన్ని నియంత్రించేవాడు అలాగే కాలాన్ని అధిగమించేవాడు కూడా. నందీశ్వరుని (ఎద్దు)లా మన దృష్టి నిరంతరం భగవంతునిపైనే ఉండాలి. మంచి, పవిత్రమైన దృష్టిని కలిగి ఉండాలి, అంటే “సుదర్శనము”,అనగా మంచి దృష్టి. పవిత్రమైన , మంచి దృష్టిని కలిగి ఉండాలంటే భగవంతుని గురించి ఆలోచించాలి, ఆయన నామాన్ని జపించాలి మరియు ఆయనపై దృష్టి పెట్టాలి. – బాబా
ఈ భజనల ద్వారా శివుడిని ధ్యానిద్దాం మరియు ప్రార్థిద్దాం.